హైదరాబాద్,క్రైమ్ మిర్రర్ః రంగనాథ స్వామి దేవాలయంలో దొంగల భీభత్సం సృష్టించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఉన్న రంగనాయకుల గుట్ట దేవాలయం లో దొంగలు రెచ్చిపోయారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి స్వగ్రామం తోర్రూర్లోని ఈ ఆలయంలో హుండీ దొంగతనం చోటుచేసుకుంది.హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ ఆలయం గతంలో కూడా లక్ష్యంగా మారింది.
ఇప్పటివరకు మూడుసార్లు దొంగతనాలు జరగడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.దుండగులు ఆలయ ప్రధాన ద్వారం పగలగొట్టి లోపలికి ప్రవేశించి, రెండు హుండీలు ఎత్తుకెళ్లారు. ఘటన తర్వాత ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆలయ భద్రతపై మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
