Homeఆంధ్ర ప్రదేశ్చంద్రబాబుకు రేవంత్ గ‌ట్టి హెచ్చరిక...! బీజేపీతో ఉంటే బీహార్ లాగే...

చంద్రబాబుకు రేవంత్ గ‌ట్టి హెచ్చరిక…! బీజేపీతో ఉంటే బీహార్ లాగే…

  • బీజేపీ ఉంటే ప్రాంతీయ పార్టీల మ‌నుగ‌డే క‌ష్టం…
  • సీఎం రేవంత్ రెడ్డి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి విచిత్రంగా ఉంది. కాంగ్రెస్ పాలిత సీఎంగా ఉండి ఎన్డీఏ నేతలతో సన్నిహితంగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్. గత కొద్దిరోజులుగా జాతీయ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఆయన ఎన్డీఏ నేతలతో నెరుపుతున్న స్నేహం జాతీయ మీడియాను సైతం విశేషంగా ఆకర్షిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన డి లిమిటేషన్ బిల్లుపై గట్టిగా మాట్లాడింది సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాల సీఎంలతో కలిసి పోరాటం చేసింది కూడా ఆయనే. ఈ పరిణామాల క్రమంలో కాంగ్రెస్ పార్టీలో సైతం రేవంత్ రెడ్డి ప్రాధాన్యం పెరిగింది. అటు తర్వాత ఎన్డీఏ పక్ష నేతల విందుకు హాజరై ఆశ్చర్యపరిచారు రేవంత్. చర్చకు కేంద్ర బిందువు అయ్యారు.

పొలిటికల్ హీట్…

నిన్నటి బిల్లుల తిరస్కరణతో జాతీయస్థాయిలో ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి అన్నట్టు పరిస్థితి మారింది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎన్డీఏ నేతలు నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ సమావేశానికి హాజరు కావడం తీవ్ర చర్చకు దారితీసింది. మహిళా బిల్లు ఓడిపోయిన కారణంగా అటు బిజెపి పెద్దలు, ఇటు కాంగ్రెస్ నేతలు తదుపరి వ్యూహంపై ఆలోచనలు చేస్తున్నారు.

ఈ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్డీఏ ఎంపీలు, ఇతర నేతలతో సరదాగా గడపడం ఏమిటనేది హాట్ టాపిక్. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజులపాటు ఢిల్లీ వెళ్లారు. మహిళా బిల్లుపై ఓటింగ్ నిర్వహించిన క్రమంలో ఆయన దేశ రాజధాని లో ఉండి విపక్షాన్ని సంఘటితం చేయడంపై దృష్టి పెట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించి తమ మాట నెగ్గించుకున్నామని కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటున్న వేళ.. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఎన్డీఏ నేతలతో సరదాగా గడపడం అనేది ఇప్పుడు అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

సంచలన వ్యాఖ్యలు…

మరోవైపు దేశ రాజకీయాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ గురువుగా భావించే చంద్రబాబుపై పరోక్ష కామెంట్స్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో జాప్యం.. కేంద్ర ప్రభుత్వ వైఖరి పై ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపితో చంద్రబాబు పెట్టుకున్న పొత్తును తప్పుపట్టారు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే, బీహార్లో నితీష్ కుమార్ రాజకీయంగా ఎదుర్కొంటున్న సవాళ్లను రేవంత్ ప్రస్తావించారు. బిజెపితో జత కట్టిన ప్రాంతీయ పార్టీల ఉనికి క్రమంగా ప్రమాదంలో పడుతోందని హెచ్చరించారు.

బిజెపి వ్యూహాలకు లోనైతే ప్రాంతీయ పార్టీల స్వతంత్రత దెబ్బతింటుందని.. చంద్రబాబు సైతం భవిష్యత్తులో తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని రేవంత్ అభిప్రాయపడ్డారు. అయితే పరోక్షంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రేవంత్ చేసిన కామెంట్స్ తో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ ప్రకంపనలు రేపాయి. తొలిసారిగా చంద్రబాబును హెచ్చరిస్తూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు