
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభమైన రోజే బీహార్ జట్టు సంచలనం సృష్టించింది. వన్డే హిస్టరీ చరిత్రలోనే మొదటిసారిగా బీహార్ జట్టు 500 కు పైగా పరుగులు చేసింది. కేవలం 45 ఓవర్లలోనే 500 పరుగుల మైలురాయిని చేరుకుంది. మొత్తంగా అరుణాచల్ ప్రదేశ్ జట్టుపై 50 ఓవర్లకు 574 పరుగులు చేసి రికార్డు సృష్టించారు. ఈ జట్టులోని ప్లేయర్లు అందరూ కూడా వీళ్ళు అసలు మనోళ్లేనా లేక వెస్టిండీస్ డేంజరస్ బ్యాట్స్మెన్ రస్సెల్ కొడుకులా అని ఆశ్చర్యపోతున్నారు. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ కూడా విజృంభించి ఆడుతున్నారు. వైభవ్ సూర్య వంశీ 84 బంతుల్లోనే 190 పరుగులు చేశారు. ఇక ఆయుష్ 56 బంతుల్లో 116, గని 40 వంతుల్లో 128, పియుస్ సింగ్ 57 పరుగులు చేసి ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ఈ మ్యాచ్లో గని అనే బ్యాట్స్మెన్ కేవలం 32 గంటల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించారు. లిస్ట్ Aక్రికెట్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ముగ్గురు ప్లేయర్లు సెంచరీలు నమోదు చేశారు. దీంట్లో బీహార్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది.
Read also : T20 లలో షఫాలి వర్మ వరల్డ్ రికార్డ్..!
Read also : రన్నింగ్ & వాకింగ్.. ఏది బెటర్?





