Homeతెలంగాణసుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..!

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: బీఆర్‌ఎస్‌ సోషల్ మీడియా కార్యకర్త శశిధర్ గౌడ్ (నల్ల బాలు) పై నమోదైన కేసులను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఫిబ్రవరి 2, 2026న సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

గత ఏడాది సెప్టెంబర్‌లో తెలంగాణ హైకోర్టు, నల్ల బాలుపై నమోదైన మూడు ఎఫ్‌ఐఆర్‌లను (FIRs) కొట్టివేసింది. ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదా అధికారిక పోస్టులను రీట్వీట్ చేయడం నేరం కాదని, అది భావప్రకటనా స్వేచ్ఛ కిందకు వస్తుందని కోర్టు స్పష్టం చేసింది.

సోషల్ మీడియా పోస్టుల విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించకూడదని, రాజకీయ విమర్శలపై అడ్డగోలుగా కేసులు నమోదు చేయవద్దని హైకోర్టు కీలక మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించినప్పటికీ, సర్వోన్నత న్యాయస్థానం ఆ వాదనలను తోసిపుచ్చి, హైకోర్టు ఉత్తర్వులే అమలవుతాయని స్పష్టం చేసింది..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు