క్రైమ్ మిర్రర్, షాబాద్ : తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భువనగిరి సమరభేరి సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను షాబాద్ మండలంలోని పద్మశాలి సంఘం ప్రతినిధి బాస నర్సింహులకు, అలాగే కురుమ సంఘం నాయకులకు రాజ్యాధికార పార్టీ నాయకులు షాబాద్ మండలంలోని నాగర్ గూడా లో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా చేవెళ్ల మండల కమిటీ అధ్యక్షుడు కూనుకుర్తి అశోక్ (అడ్వకేట్) మాట్లాడుతూ…. తెలంగాణలో బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కులు దక్కే వరకు పోరాటం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర సంపద సృష్టిలో బీసీల పాత్ర అత్యంత కీలకమైనదైనా, అధికార వ్యవస్థల్లో వారికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ కులాల ఐక్యతే సామాజిక న్యాయానికి బలమైన ఆయుధమని పేర్కొంటూ, భువనగిరి సమరభేరి బీసీల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాలని పిలుపునిచ్చారు. బీసీల రాజ్యాధికారమే తెలంగాణ అభివృద్ధికి నిజమైన మార్గమని, ప్రతి బీసీ కుటుంబం ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు ముద్దెంగూడెం జనార్ధన్ ముదిరాజ్, చేవెళ్ల మండల అధ్యక్షుడు కునుకుర్తి అశోక్ (అడ్వకేట్) షాబాద్ మండల అధ్యక్షుడు కావలి శంకర్ ముదిరాజ్, మండల యువజన విభాగం ప్రతినిధి వి. హరీష్ కుమార్, తాళ్ళపల్లి మాజీ ఉప సర్పంచ్ బాస నర్సింహులు, కురుమ సంఘం నాయకులకు మద్దూరి సత్తయ్య , మందారం చందు, మరియు మల్లన్న అభిమానులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.