నిజామాబాద్, క్రైమ్‌మిర్రర్: బట్టల ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ తగిలి దంపతులు అక్కడికక్కడే మృతి చెందిన నిజామాబాద్‌జిల్లాలో చోటు చేసుకుంది. బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో దంపతులు మృతి చెందారు.
Also Read:Agricultural Loans: రైతులకు సులభంగా రుణాలు.. రూ.2 లక్షల వరకు తాకట్టు అవసరం లేదు!
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఉట్పల్లి గ్రామంలో ఉతికిన బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో, రత్నావత్ సంజీవ్(45), జ్యోతి(41) అనే దంపతులు కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతిచెందారు. ముగ్గురు పిల్లలు స్వల్ప గాయాలతో ప్రమాదం నుండి బయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:Parking Row Turns Deadly: బైక్ పార్కింగ్ గొడవ.. మహిళ ప్రాణం తీసింది!