Homeతెలంగాణత‌స్మాస్ జాగ్ర‌త్త‌.... ఫ్రీ AC యోజన పేరుతో కొత్త స్కామ్.. ఒక్క క్లిక్‌తో బ్యాంక్ ఖాతా...

త‌స్మాస్ జాగ్ర‌త్త‌…. ఫ్రీ AC యోజన పేరుతో కొత్త స్కామ్.. ఒక్క క్లిక్‌తో బ్యాంక్ ఖాతా ఖాళీ…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఏసీలు ఇస్తోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్రీ AC యోజన మెసేజ్‌లపై సైబర్ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచిత ఏసీ అందిస్తామని చెబుతూ నకిలీ వీడియోలు, లింక్‌లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ స్కామ్‌లో ఒక్కసారి లింక్‌పై క్లిక్ చేసినా లేదా నకిలీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసినా వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్ల చేతుల్లో పడే ప్రమాదం ఉంది.

Also Read:ద్రాక్షారామ కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం – 40కిపైగా దుకాణాలు ధ్వంసం

వైరల్ అవుతున్న వీడియోలో ప్రధాని నరేంద్ర మోదీ ఉచిత ఏసీ పథకాన్ని ప్రకటించినట్లు చూపిస్తున్నారు. అయితే ఇది పూర్తిగా AI సాయంతో రూపొందించిన నకిలీ వీడియో అని ప్రభుత్వ ఫ్యాక్ట్‌ చెక్ విభాగం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం పేరుతో ఇలాంటి పథకం ఏదీ అమల్లో లేదని అధికారులు వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌లు లేదా ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రకటించని పథకాలను నమ్మవద్దని సూచించారు. ఈ స్కామ్‌లో భాగంగా సైబర్ మోసగాళ్లు ఒక లింక్ పంపించి, దానిపై క్లిక్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెబుతారు. ఆ యాప్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారం, కాంటాక్ట్స్, బ్యాంకింగ్ వివరాలు, OTPలకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఏసీ డెలివరీ ఛార్జీలు లేదా రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో చిన్న మొత్తంలో డబ్బులు చెల్లించమని అడుగుతారు.

Also Read:Team India: ఐర్లాండ్ చేతిలో టీమిండియాకు షాక్.. తొలి టీ20లో 34 పరుగుల తేడాతో ఘోర పరాభవం!

ఇలాంటి మోసాల నుంచి రక్షణ పొందాలంటే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ప్రకటనను నమ్మకూడదు. అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, ఫ్యాక్ట్‌ చెక్ పోర్టల్‌లు లేదా విశ్వసనీయ వార్తా సంస్థల ద్వారా మాత్రమే సమాచారం నిజమో కాదో నిర్ధారించుకోవాలి. తెలియని లింక్‌లపై క్లిక్ చేయకూడదు. అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేయకూడదు. అలాగే OTPలు, బ్యాంక్ వివరాలు, ఆధార్ సమాచారం వంటి వ్యక్తిగత వివరాలను ఎవరికీ ఇవ్వకూడదు. ప్రభుత్వ పథకాల పేరుతో వస్తున్న ఇలాంటి నకిలీ మెసేజ్‌లపై అప్రమత్తంగా ఉంటేనే సైబర్ మోసాల నుంచి మన డబ్బు, వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు

Also Read:గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న బుల్లెట్ – ఇద్దరు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు