Homeక్రైమ్కేత‌న్ అగ‌ర్వాల్‌హ‌త్య కేసులో సంచ‌ల‌న విష‌యాలు...! జుట్టు విష‌యం వ‌ల్ల‌నే హ‌త్యా...?

కేత‌న్ అగ‌ర్వాల్‌హ‌త్య కేసులో సంచ‌ల‌న విష‌యాలు…! జుట్టు విష‌యం వ‌ల్ల‌నే హ‌త్యా…?

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: పూణే సమీపంలోని లోహ్‌గఢ్ కోట వద్ద 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తొలుత ప్రమాదంగా భావించిన ఈ ఘటన.. ఇప్పుడు పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె స్నేహితుడు చేతన్ చౌదరి కలిసి హత్యకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. జూన్ 18న లోహ్‌గఢ్ కోటకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన సమయంలో కేతన్‌పై దాడి చేసి, కోటపై నుంచి కిందకు తోసేసినట్లు పోలీసులు తెలిపారు. మొదట ప్రమాదంలా చూపించే ప్రయత్నం చేసినప్పటికీ, లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. నిందితులు ఇద్దరూ హత్యకు పాల్పడినట్లు అంగీకరించినట్లు పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ వెల్లడించారు.

Also Read:గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూటీని ఢీకొన్న బుల్లెట్ – ఇద్దరు మృతి

ఈ ఘటనపై కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులకు ఉరిశిక్ష విధించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించి, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. కేతన్ తలపై చిన్న హెయిర్ ప్యాచ్ (విగ్) ఉండటమే హత్యకు కారణమా అనే ప్రశ్నకు స్పందించిన ఆయన..వివాహానికి ముందే ఈ విషయాన్ని వారి కుటుంబానికి స్పష్టంగా చెప్పాం. ఒక చిన్న హెయిర్ ప్యాచ్ కారణంగా ప్రాణాలు తీయడం దారుణం. పెళ్లి ఇష్టం లేకపోతే చెప్పాల్సింది కానీ ఇలా చేయడం అమానుషం అని కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read:మహిళల కోసం రైల్వే కీలక నిర్ణయం – స్టేషన్లలో ఉచిత శానిటరీ ప్యాడ్లు

దర్యాప్తులో మరో షాకింగ్ విషయం కూడా బయటపడింది. ఈ నెల 6న కేతన్, సియా కలిసి బాలి వెళ్లాల్సి ఉండగా, విమానాశ్రయంలో కేతన్ పాస్‌పోర్ట్ మాయమవడంతో ప్రయాణం రద్దయింది. అలాగే ట్రెక్కింగ్‌కు వెళ్లాలని కూడా సియానే ఒత్తిడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. గత ఏడాదిగా సియా, చేతన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. తమ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉంటూ షాపింగ్‌లు, డిన్నర్‌లకు వచ్చిన సియా.. ఇంత పెద్ద కుట్ర చేస్తుందని ఊహించలేదని కేతన్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా, కేసుపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read:ఘనంగా ‘రొట్టెల పండుగ’ ప్రారంభం… దేశం నలుమూలల నుంచి భక్తుల రద్దీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు