క్రైమ్ మిర్రర్, సినిమా :- టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి దర్శకుడు పూరీ జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైసా వసూల్ సినిమా సమయంలో ఏర్పడిన అనుబంధంతో బాలయ్య వ్యక్తిత్వంపై పూరీ చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ.. బాలయ్య సినిమాల్లో అద్భుతంగా నటిస్తారు.. కానీ బయట మాత్రం అసలు నటించరు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెండితెరపై పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించే బాలకృష్ణ.. నిజ జీవితంలో మాత్రం ఎంతో నిజాయితీగా, ఎలాంటి కపటం లేకుండా ఉంటారని చెప్పారు.
ఆయన మనసులో ఏది ఉంటే అదే నేరుగా మాట్లాడేస్తారు. కోపం వచ్చినా.. ఆనందం వచ్చినా దాచుకోరు. చిన్నపిల్లాడిలా చాలా సింపుల్‌గా ఉంటారు అంటూ పూరీ బాలయ్య స్వభావాన్ని వివరించారు.సెట్స్‌లో బాలకృష్ణ చూపించే ఎనర్జీ గురించి కూడా పూరీ ప్రశంసించారు. భారీ స్టార్‌డమ్ ఉన్నప్పటికీ దర్శకుడి మాటకు విలువ ఇచ్చి.. చెప్పినట్లే చేయడానికి ముందుంటారని తెలిపారు. అహంకారం లేకుండా పని చేయడం బాలయ్యలో తనకు బాగా నచ్చిన అంశమని చెప్పారు.2017లో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పైసా వసూల్ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితం అందుకున్నా.. అందులో బాలయ్య బాడీ లాంగ్వేజ్, పూరీ స్టైల్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగుతోంది.
ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్న పూరీ జగన్నాథ్.. ఆ తర్వాత బాలకృష్ణ కోసం మరో పక్కా మాస్ కథ సిద్ధం చేస్తున్నారన్న వార్త కూడా టాలీవుడ్‌లో వినిపిస్తోంది. దీంతో వీరి కాంబో మరోసారి రిపీట్ అవుతుందా? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.ఇక బాలయ్యపై పూరీ చేసిన “సినిమాల్లో నటిస్తారు.. బయట మాత్రం నటించరు” అన్న కామెంట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.