Homeతెలంగాణమెంథా తుఫాన్ ప్రభావం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి..!

మెంథా తుఫాన్ ప్రభావం పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి..!

కోదాడ, క్రైమ్ మిర్రర్ :- మెంథా తుఫాన్ ప్రభావం వల్ల ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లా మరియు రెండు నియోజకవర్గాల సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అన్ని శాఖల అధికారులు గ్రామాలలో పట్టణాలలో ప్రజలు అందుబాటులో ఉండి సమన్వయంతో పనిచేసి ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు ప్రమాదకరంగా ఉన్న వాగులు వంకలు కాలువలు చెరువులు కుంటలు వద్దకు ఎవరూ కూడా వెళ్లద్దన్నారు శిధిలమైన భవనాలలో ఉండద్దన్నారు విద్యుత్ వైర్లు ట్రాన్స్ఫార్మర్లు మోటర్లు స్తంభాలను తాకద్దని ప్రజలకు రైతులకు సూచించారు అత్యసరమైతేనే ఇంటి నుండి బయటికి రావాలని మంత్రి ఎమ్మెల్యే ప్రజలను కోరారు.

Read also : యూఏఈలో తెలుగోడికి రూ.240 కోట్ల లాటరీ

Read also : పంటల కోతలు వాయిదా వేసుకోవాలి..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు