తెలంగాణ

భట్టితో పాటు కీలక మంత్రుల ఫోన్లు టాప్! రేవంత్ పై సంచలన ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో గంటలో సంచలన వెలుగు చూస్తోంది. దీపావళికి ముందే పొలిటికల్ బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సొంతమంత్రులతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి టాప్ చేస్తున్నారని ఆరోపించారు.

ఫోన్ టాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ సవాలు విసిరారు. దమ్ముంటే కెమెరాల ముందు ఈ అంశంలో లై డిటెక్టర్ పరీక్షకు రావాలని అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే నా సవాలు స్వీకరించి బహిరంగంగా ఫోన్ ట్యాప్ చేయడం లేదని ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులతో పాటు నా ఫోన్ టైపింగ్ చేయట్లేదని చెప్పాలని నిలదీశారు . సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష నేతల ఫోన్లను కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

Read More : రోడ్డెక్కిన పోలీస్ భార్యలు..హైదరాబాద్‌లో ఫుల్ ట్రాఫిక్ జాం

ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి అవే నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. 50 లక్షల రూపాయల బ్యాగుతో పట్టుబడిన రేవంత్ రెడ్డిని దొంగ అనకుంటే ఏమంటారని ప్రశ్నించారు. డబ్బుల కట్టలతో సభ్యులను కొనాలనుకున్న రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాల్సి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందన్నారు కేటీఆర్.100 రోజుల్లోనే అనేక హామీలను నెరవేరుస్తామంటూ చెప్పి ఆరు గ్యారెంటీలు కాదు హాఫ్ గ్యారెంటీలు మాదిరి అయిపోయిందని కేటీఆర్ విమర్శించారు.

Back to top button