Homeజాతీయందటీజ్ దళపతి.. పోటీ చేసిన రెండు చోట్ల ‘విజయ్’మే..

దటీజ్ దళపతి.. పోటీ చేసిన రెండు చోట్ల ‘విజయ్’మే..

తమిళ రాజకీయ యవనికపై నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ అద్భుత సంచలనం సృష్టించారు. పార్టీ స్థాపించిన రెండేళ్లకే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ కోటపై తన జెండా ఎగురవేశారు. సినిమాల్లోనే కాదు పాలిటిక్స్‌లోనూ తానే ‘సూపర్ హిట్’ అని నిరూపించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుండి పోటీ చేసిన విజయ్ రెండు చోట్లా భారీ విజయం సాధించి తన సత్తా చాటారు.

విశ్లేషకులు కేవలం కింగ్‌మేకర్‌గా మాత్రమే అభివర్ణించినా ఆయన నేరుగా ‘కింగ్’ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే వందకు పైగా చోట్ల ఆధిక్యం ప్రదర్శించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. మే 7న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

విజయ్ తన అభ్యర్థుల ఎంపికలో సామాన్యులకు పెద్దపీట వేయడం గెలుపుకు ప్రధాన కారణమైంది. రాజకీయ వారసత్వానికి చరమగీతం పాడుతూ క్షేత్రస్థాయి కార్యకర్తలకు ప్రాధాన్యతనిచ్చారు. తన వద్ద 30 ఏళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌ను విరుగంబాక్కం నుంచి బరిలోకి దించి విజయం సాధించారు.

అలాగే రోయపురం నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ కె.విజయ్ ధాముకు సీటిచ్చి రాజకీయ ఉద్దండులపై గెలిపించుకున్నారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్నాడీఎంకే నేత జయకుమార్ వంటి హేమాహేమీలను సామాన్య ఆటో డ్రైవర్ ఓడించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అపూర్వ ఫలితాలతో తమిళనాడులో సరికొత్త రాజకీయ శకానికి విజయ్ పునాది వేశారు.

ALSO READ: తమిళనాడుకి కాబోయే సీఎం ఆస్తుల వివరాలు ఇవే…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు