Homeక్రైమ్హైదరాబాద్‌ ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం: 1 మృతి, 4 గురుకి గాయాలు.

హైదరాబాద్‌ ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం: 1 మృతి, 4 గురుకి గాయాలు.

క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం ఒకరు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

హైదరాబాద్‌లోని సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో అత్యవసర విభాగం భవనంలో పునర్నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ESI Medical College and Hospital) అత్యవసర వార్డులో భవనం ఐదవ అంతస్తులో పునర్నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మాణ సామాగ్రిని తరలించడానికి ఏర్పాటు చేసిన తాత్కాలిక లిఫ్ట్ (suspended platform) లేదా సెంట్రింగ్ (తాత్కాలిక నిర్మాణ మద్దతు) కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన భానుచందర్ (24) అనే సబ్-కాంట్రాక్టర్ మృతి చెందాడు. మరో నలుగురు కార్మికులు గాయపడ్డారు, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి గల కారణాలు తాత్కాలిక ప్లాట్‌ఫారమ్ సామర్థ్యానికి మించి మార్బుల్ స్లాబ్‌లను లోడ్ చేయడం వల్ల అది కూలిపోయిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మాణ సమయంలో భద్రతా ప్రమాణాలను పాటించారా, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు