Homeక్రైమ్అరుణాచలంలో దారుణ ఘ‌ట‌న‌....! గిరిప్ర‌ద‌క్షిణ మార్గంలో యువ‌తిపై గ్యాంగ్ రేప్‌...! రాష్ర్ట వ్యాప్తంగా క‌ల‌క‌లం...

అరుణాచలంలో దారుణ ఘ‌ట‌న‌….! గిరిప్ర‌ద‌క్షిణ మార్గంలో యువ‌తిపై గ్యాంగ్ రేప్‌…! రాష్ర్ట వ్యాప్తంగా క‌ల‌క‌లం…

చెన్నై, క్రైమ్ మిర్ర‌ర్‌: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు అధిక సంఖ్యలో సంచరించే అరుణాచలం గిరిప్రదక్షిణ మార్గంలో ఇద్దరు యువతులపై దుండగులు దాడి చేయగా, వారిలో ఒక 23 ఏండ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మే 30న రాత్రి గిరిప్రదక్షిణకు వచ్చిన ఇద్దరు యువతులు అడిఅణ్ణామలై ప్రాంతం సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా కొందరు దుండగులు వారిని అడ్డగించారు.

తరువాత బలవంతంగా సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. మరో యువతిపై కూడా దౌర్జన్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దుండగులు బాధితుల నగ్న వీడియోలు చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితుల దగ్గరున్న బంగారు ఆభరణాలు, నగదు,

విలువైన వస్తువులు దోచుకుని అక్కడి నుంచి పరారైయారు. మే 31న తిరువణ్ణామలైలోని మహిళా పోలీస్ స్టేషన్ను బాధితులు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ కేసును ఛేదించేందుకు ఐదు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు, వివిధ ప్రాంతాల్లో గాలింపు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా మొత్తం 11 మంది నిందితులను గుర్తించినట్లు సమాచారం. వారిలో వాసుదేవన్, ఆకాష్, అప్పు, హరిహరన్, అరుణ్ కుమార్, శివగణేషన్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు