Homeక్రైమ్ముంపు పరిహారం డబ్బుల కోసం భర్త హత్య? ప్రియుడితో కలిసి భార్య కుట్ర.. 

ముంపు పరిహారం డబ్బుల కోసం భర్త హత్య? ప్రియుడితో కలిసి భార్య కుట్ర.. 

మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగుచూసిన ఓ హత్య ఘటన కలకలం రేపుతోంది. ముంపు పరిహారం కింద వచ్చిన రూ.18 లక్షల డబ్బుల కోసం ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామానికి చెందిన గజ్జి మల్లికార్జున్ అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 20న కూలి పని ఉందనే నెపంతో శివ అనే వ్యక్తి మల్లికార్జున్‌ను తన వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ తర్వాత అతడు హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, మల్లికార్జున్ భార్య అంజమ్మ తన ప్రియుడు శివతో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముంపు పరిహారం రూపంలో వచ్చిన రూ.18 లక్షల నగదే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని నెమళ్లగుట్ట సమీపంలో మల్లికార్జున్ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు, హత్యలో ఎవరెవరి పాత్ర ఉందనే విషయాలను తేల్చేందుకు విచారణ కొనసాగిస్తున్నారు. రూ.18 లక్షల పరిహారం కోసం జరిగిన హత్యేనా? లేక ఈ ఘటన వెనుక మరేదైనా కారణం ఉందా? అనేది పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

also read: నంద్యాలలో ఘోర విషాదం.. సోలార్ బ్యాటరీ పేలి ఐదేళ్ల బాలుడు సజీవదహనం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు