Homeతెలంగాణతెలంగాణలో గోదావరి పుష్కర శోభ...!

తెలంగాణలో గోదావరి పుష్కర శోభ…!

  • సన్నాహాలను ముమ్మరం చేసిన ప్రభుత్వం

  • అధికారిక లోగో, టాగ్ లైన్ లకు ప్రత్యేక ఆహ్వానం

  • ఎంపికైన వాటికి నగదు బహుమతులు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సన్నాహాలను వేగవంతం చేసింది. ఈ మహాక్రతువుకు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలనే ఉద్దేశంతో అధికారిక లోగో, టాగ్ లైన్ రూపకల్పన పోటీని ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాదులోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్రత్యేక వర్క్ షాప్ జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పోటీ వివరాలను అధికారికంగా వెల్లడించారు. సృజనాత్మకత కలిగిన డిజైనర్లు, కళాకారులు, యువత ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని తమ వినూత్న డిజైన్లను పంపాలని ఆయన ఆహ్వానించారు.

భారీగా నగదు బహుమతులు…

ఈ పోటీలకు సంబంధించి విజేతలకు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఉత్తమంగా ఎంపికైన మొదటి బహుమతి విజేతకు లక్ష రూపాయలు, రెండో బహుమతి విజేతకు 50 వేల రూపాయలు, మూడో బహుమతి విజేతకు 25వేల రూపాయల చొప్పున నగదు పురస్కారాలను అందించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కామ్ రూపొందించిన లోగో తో పాటు ట్యాగ్లైన్ ను కలిపి నవంబర్ 30లోగా.. [email protected] అనే మెయిల్ ఐడి కి పంపాలని అధికారులు సూచించారు.

అధికారిక చిహ్నంగా…

రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఈ లోగో, 2027 గోదావరి పుష్కరాలకు అధికారిక చిహ్నంగా నిలవనుంది. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజులపాటు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, గోదాపురి నది వైభవం ఉట్టిపడేలా ఈ డిజైన్లు ఉండాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి సుమారు 8 కోట్ల మంది భక్తులు తరలి వస్తారని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పుష్కర స్నానాలు, వసతి, రవాణా, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా గోదావరి తీరం వెంబడి 67 ప్రధాన ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. కరీంనగర్ గడ్డపై బండి సంజయ్ గర్జన.. జైశ్రీరామ్’ నినాదంతో హోరెత్తిన సభ!
  2.  ఆర్సీబీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. యశ్ దయాళ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  3. బియ్యం ధరలపై సామాన్యులకు ఊరటనిచ్చేలా కేంద్రం కీలక యోచన
  4.  18 టెక్నాలజీ ఫార్మాట్లలో ‘వారణాసి’.. ప్రపంచ సినీ ప్రేక్షకుల కోసం రాజమౌళి భారీ ప్లాన్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు