Homeక్రైమ్వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఇద్దరిపై దాడి.. నర్సంపేటలో కలకలం!

వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఇద్దరిపై దాడి.. నర్సంపేటలో కలకలం!

వరంగల్ జిల్లాలో వివాహేతర సంబంధం ఆరోపణలతో ఇద్దరిపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. నర్సంపేటలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేటలోని సంజయ్ గాంధీనగర్‌కు చెందిన గణేశ్‌కు, మంచిర్యాల జిల్లాకు చెందిన తన సమీప బంధువు భార్యతో వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు మహిళకు గణేశ్ వరుసకు అన్న అవుతాడని సమాచారం. ఈ క్రమంలో కొంతకాలంగా వారిద్దరూ వరంగల్ నగరంలో కలిసి నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న మహిళ భర్త శుక్రవారం వారిద్దరినీ గుర్తించి నర్సంపేటకు తీసుకొచ్చాడు. అక్కడ గణేశ్‌ను ఓ చెట్టుకు కట్టేసి దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళపై కూడా దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి గల పూర్తి వివరాలు, ఘటనకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.

also read: బద్వేలు ప్రైవేట్ స్కూల్‌లో క్షుద్రపూజల కలకలం.. గుప్తనిధుల కోసమేనా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు