Homeక్రైమ్లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టోలిచౌక్ ఇన్‌స్పెక్టర్

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన టోలిచౌక్ ఇన్‌స్పెక్టర్

క్రైమ్ మిర్రర్ : హోటల్‌ నిర్వహణకు అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్‌ చేసిన గోల్కొండ జోన్‌ పరిధిలోని టోలిచౌక్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ నాయక్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఓ కేఫెటీరియాను భవిష్యత్తులో ప్రతిరోజూ రాత్రి ఒంటి గంట వరకు నిర్వహించడంతో పాటు, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లను పూర్తి చేసుకునేందుకు సహకరించాలని నిర్వాహకులు ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదించారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న ఇన్‌స్పెక్టర్ ప్రతి నెలా రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. మొదటి నెలకు రూ.40 వేలు చెల్లించాలని కోరగా, అందులో తొలి విడతగా రూ.20 వేలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

అనంతరం ఇన్‌స్పెక్టర్‌కు సంబంధించిన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించగా, నాలుగు ఎన్వలప్ కవర్లలో రూ.1.80 లక్షల నగదు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
also read : రంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్ర‌మాదం….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు