-
ఢిల్లీలో ప్రత్యేక భేటీ
-
జాతీయ క్రీడా పోటీలకు ప్రత్యేక ఆహ్వానం
-
ఆహ్లాద పూరిత వాతావరణంలో సమావేశం
క్రైమ్ మిర్రర్, న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులు, ఎల్ నినో ప్రభావంతో ఏర్పడిన కరువు పరిస్థితులు, లోటు వర్షపాతం వంటి అంశాలపై ప్రధానితో చర్చించేందుకు సీఎం ఈ భేటీలో పాల్గొని వినతి పత్రం సమర్పించారు. డిసెంబర్ లో తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి రాష్ట్రంలో తలపెట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ లక్ష్యాలను వివరిస్తూ ప్రత్యేక పత్రాలను అందజేశారు.
ఖేలో ఇండియా క్రీడా పోటీలు…
జాతీయస్థాయిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా తెలంగాణలో జరగబోయే ఖేలో ఇండియా క్రీడా వేడుకల ఏర్పాట్లు, రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ఆర్థిక సహాయం పై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్ వెంట రాష్ట్ర మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కూడా ఉన్నారు. అయితే భారత్ సమ్మిట్ నిర్వహించిన మరుసటి రోజే సీఎం రేవంత్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంగా నిర్వహించడం పై విమర్శలు వచ్చాయి.
ప్రత్యేక ఆకర్షణ…
ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటూ రేవంత్ రెడ్డి తరచూ ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తున్నారు. వారిద్దరూ పరస్పరం గౌరవించుకుంటున్నారు. అయితే తాజాగా భేటీ సైతం స్నేహపూర్వక వాతావరణం లో కొనసాగడం విశేషం. ప్రధాని నరేంద్ర మోడీ మెడలో సాంప్రదాయ పట్టు కండువాను అలంకరించి.. నవ్వుతూ ఆహ్వాన పత్రాన్ని అందిస్తున్న సమయంలో ఇద్దరు నేతలు ఎంతో ఆప్యాయంగా ముచ్చటించుకున్నారు. జాతీయ క్రీడా వేడుకల పత్రాలను ప్రధానికి చూపుతున్న సందర్భంలో ఇరువురి ముఖాల్లోనూ కనిపించిన చిరునవ్వులు, సానుకూల దృక్పథం సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
