Homeఆంధ్ర ప్రదేశ్బిగ్ అల‌ర్ట్‌...! ఏపీకి భారీ వ‌ర్ష సూచ‌న‌...

బిగ్ అల‌ర్ట్‌…! ఏపీకి భారీ వ‌ర్ష సూచ‌న‌…

అమ‌రావ‌తి, క్రైమ్‌మిర్ర‌ర్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలోని వాయుగుండం ప్ర‌భావంతో ప‌లు జిల్లాల‌కు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని రాష్ర్ట విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ఎండీ, ఆరీ్టీజీఎస్ సీఈవో ప్ర‌ఖ‌ర్ జైన్ తెలిపారు. వాయుగుడండం అల్ప‌పీడ‌నం బ‌ల‌ప‌డింద‌ని తెలిపారు. ఆగ్నేయానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళ‌ఖాతంలో వాయుగుండం కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు. అండమాన్ దీవులకు 700 కిలోమీటర్లు, చెన్నైకు 860 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని తెలిపారు.

విశాఖపట్నానికి 1040 కిలోమీటర్లు, గోపాల్‌పూర్ (ఒడిశా)కు1160 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. దక్షిణ మధ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో రేపు (సోమవారం) తుపానుగా బలపడే అవకాశం ఉందని వివరించారు. ఎల్లుండి (బుధవారం) పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతానికి ఇది చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు