Homeసినిమాశేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు!

శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు!

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ శివార్లలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో సినీ వర్గాల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్‌తో పాటు కారులో ఉన్న వారందరూ క్షేమంగా బయటపడ్డారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘కాక’ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్ ప్రాంతంలో జరుగుతోంది. ఈ చిత్రీకరణలో పాల్గొన్న శేఖర్ మాస్టర్, షూటింగ్ ముగిసిన అనంతరం తన బృందంతో కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు.

ఈ క్రమంలో తెల్లవారుజామున సుమారు 6 గంటల సమయంలో ముచ్చింతల్ సమీపంలోని నాలుగు రోడ్ల కూడలి వద్దకు చేరుకోగానే, ఆయన ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీకొట్టింది. దీంతో కారు కొంతమేర దెబ్బతిన్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్నవారంతా బయటకు వచ్చారు. అయితే ఈ ఘటనలో శేఖర్ మాస్టర్‌తో పాటు ఆయన బృందంలోని ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పెను ప్రమాదం తప్పడంతో అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఊరట చెందారు. ప్రస్తుతం ఈ ప్రమాద వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

also read: రాప్తాడు నిందితుడికి అరుదైన ఆరోగ్య సమస్య.. వైద్య పరీక్షల్లో కీలక విషయాలు వెల్లడి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు