క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్‌లోని రాప్తాడు ఘటనలో నిందితుడిగా ఉన్న హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక విషయాలను వెల్లడించారు. ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అతడు బెడ్ పైనుంచి కిందపడటంతో, వైద్యులు అప్రమత్తమై అతడికి పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో హేమంత్ ‘పల్మనరీ ఎంబాలిజం’ అనే తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది.
వైద్య పరిభాషలో పల్మనరీ ఎంబాలిజం అంటే ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం. దీనివల్ల ఊపిరితిత్తులకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రస్తుతం హేమంత్ ఆరోగ్య పరిస్థితిని గమనించిన వైద్యుల బృందం అతడికి ప్రత్యేక చికిత్సను అందిస్తోంది. సాధారణంగా ఏదైనా సర్జరీలు జరిగిన తర్వాత లేదా ఎక్కువ రోజులు కదలకుండా పడకపైనే ఉన్నవారిలో ఇలాంటి తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల రక్తప్రసరణ ఒక్కసారిగా ఆగిపోయి, దాని ప్రభావం నేరుగా గుండెపై పడుతుందని వైద్యులు తెలిపారు. గుండెపై తీవ్రమైన ఒత్తిడి పెరగడం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా సంభవించే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు హేమంత్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తూ తగిన చికిత్స అందిస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత పోస్టుల కలకలం.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు!
