గత రెండేళ్లుగా భారతదేశంలో ఆశ్రయం పొందుతూ తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, త్వరలోనే తన స్వదేశానికి తిరిగి వెళ్లనుండటం అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. వచ్చే నెలలో తాను కచ్చితంగా బంగ్లాదేశ్ గడ్డపై అడుగుపెడతానని ఆమె సంచలన ప్రకటన చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు, బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత ప్రభుత్వం షేక్ హసీనాపై అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తోంది. హసీనా ఒక ఉగ్రవాది అని, దేశంలో జరిగిన అరాచకాలకు ఆమెనే ప్రధాన కారణమని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆమెకు మరణశిక్ష విధించడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని బంగ్లా సర్కార్ బహిరంగంగానే హెచ్చరిస్తోంది. ఇంతటి తీవ్రమైన హెచ్చరికలు, ప్రాణహాని పొంచి ఉన్నప్పటికీ షేక్ హసీనా ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.
ప్రభుత్వం తనను చంపినా సరే లెక్కచేయబోనని, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెల బంగ్లాదేశ్‌కు వెళ్లి తీరుతానని హసీనా తెగేసి చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమె నిజంగానే చావుకు ఎదురెళ్తారా అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. ఒకవేళ ఆమె బంగ్లాదేశ్‌కు వెళ్తే అక్కడి ప్రభుత్వం నిజంగానే మరణశిక్షను అమలు చేస్తుందా? లేక రాజకీయ సమీకరణాలు మారిపోతాయా? ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు, పరిణామాలు చోటుచేసుకుంటాయి అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ కు అగ్నిపరీక్ష…!పట్టభద్రుల ఎన్నికల్లో ఓడిపోతే భారీ డ్యామేజ్…
