-
నెహ్రూ- గాంధీ కుటుంబ అంతర్గత జీవన సంఘర్షణల ఆవిష్కరణ
-
సానుభూతి కోసం ప్రయత్నం అంటూ బిజెపి ఎదురుదాడి
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తన ఆత్మ కథను రాసుకున్నారు. బి లాగింగ్.. ఏ జర్నీ ఆఫ్ లవ్ ఆత్మకథ మార్కెట్లోకి వచ్చాక.. ఆమె వెల్లడించిన అంశాలపై భిన్నమైన చర్చలు జరుగుతున్నాయి. ఇటలీ నుంచి వచ్చిన ఒక సాధారణ యువతిగా గాంధీ కుటుంబంలో అడుగుపెట్టినప్పటి నుంచి.. 1969 లో తన తొలి సంతానాన్ని నెలలు నిండకుండానే కోల్పోయినప్పటి తీవ్ర మానసిక క్షోభ, రాజీవ్ గాంధీ కన్నీళ్లు, ఇందిరా గాంధీ మరణం, నెహ్రూ – గాంధీ కుటుంబ అంతర్గత జీవన సంఘర్షణలను ఆమె ఈ పుస్తకంలో సున్నితంగా ఆవిష్కరించారు. అయితే కేవలం వ్యక్తిగత ప్రేమ, నష్టాల విషయాలే కాకుండా.. భారత రాజకీయాలను శాసించిన సుదీర్ఘ అధికార ప్రస్థానం, పార్టీలో అంతర్గత సంక్షోభాలు, యుపిఏ సంకీర్ణ పాలనల వెనుక ఉన్న తెర వెనుక రాజకీయాలను కూడా ఆమె ఈ పుస్తకంలో స్పృశించడంతో.. ఈ పుస్తకం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారింది.
సున్నిత భావోద్వేగాలు సైతం…
1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల నాటి పరిస్థితులు, ఆ సమయంలో ఇందిరా గాంధీ మరణానంతరం సాగిన పరిణామాలపై సోనియా గాంధీ వ్యక్తం చేసిన భావోద్వేగాలు, కాంగ్రెస్ దిగ్గజనేత ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాలనుకున్నారని పేర్కొన్న అంశాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 2004లో ప్రణబ్ ముఖర్జీ ప్రధానమంత్రి పదవి ఆశించినప్పటికీ.. రాజకీయ కారణాలతో మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేయాల్సి వచ్చిందన్న కోణాన్ని ఆమె పుస్తకంలో వివరంగా వివరించారు. ఈ అంశంపై అటు ప్రణబ్ ముఖర్జీ కుమార్తె సర్మిష్టముఖర్జీ స్పందించారు. తన తండ్రి డైరీలో రాసుకున్న అంశాలను.. పార్టీ పట్ల ఆయన విధేయతను ఆమె గుర్తు చేశారు. దీంతో కాంగ్రెస్ అంతర్గత అధికారిక పోరాటాలు మళ్ళీ తెరపైకి వచ్చాయి.
బిజెపి ఎదురుదాడి…
సోనియాగాంధీ ఆత్మకథలు అంశాలపై బిజెపి ఎదురుదాడి ప్రారంభించింది. పుస్తకంలో ఆమె వ్యక్తం చేసిన బాధ, ఆవేదనలు కేవలం మొసలి కన్నీరు మాత్రమేనని కొట్టిపారేసింది. 1984 నాటి సిక్కుల ఊచకోత ఘటనలను ప్రస్తావిస్తున్నారు.. వేలాది మంది అమాయక సిగ్గులు ఢిల్లీ వీధుల్లో దారుణంగా హత్యకు గురైనప్పుడు మౌనంగా ఉండి.. ఆ అల్లర్లకు కారకులైన కాంగ్రెస్ నేతలను దశాబ్దాల పాటు కాపాడుతూ పదవులు కట్టబెట్టిన వారు.. ఇప్పుడు దశాబ్దాల తర్వాత పుస్తకాల్లో సానుభూతి వ్యాఖ్యలు రాయడం పచ్చి అవకాశవాదమని దుయ్యబట్టారు. అంతేకాకుండా మైనారిటీల ఓట్లను ఆకట్టుకునేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలు, తప్పిదాలను తుడిచి పెట్టేందుకే ఈ పుస్తకంలో ప్రయత్నించారని బిజెపితో పాటు విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి.
నాటి సంగతులను గుర్తు చేస్తూ…
యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు అనూహ్యంగా మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. అయితే అప్పట్లో ప్రణబ్ ముఖర్జీ వంటి అపార అనుభవం ఉన్న నాయకుడిని కాకుండా.. రిమోట్ కంట్రోల్ పాలన కోసం మన్మోహన్ సింగ్ ను ప్రధాన చేశారన్న ఆరోపణ ఉండేది. ఇప్పుడు దానిని గుర్తు చేస్తోంది బిజెపి. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో అధికారం కోసం అంతర్గతంగా జరిగే వ్యవహారాలను సోనియా గాంధీ బయట పెట్టడం బిజెపికి అస్త్రంగా మారింది. రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన నాయకులు రాసి ఆత్మకథలు కేవలం జ్ఞాపకాల సమాహారంగా మాత్రమే మిగిలిపోకూడదు. ఈ విషయంలో మాత్రం ఈ పుస్తకంలో లోటు కనిపిస్తోంది.
ఇవి కూడ చదవండి:
-
టాలీవుడ్లోకి రష్మిక ఎంట్రీ వెనుక ఆసక్తికర నిజాలు.. మొదట నటించడానికి ఒప్పుకోలేదన్న డైరెక్టర్!
-
హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్.. క్రిమినల్ కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్
-
పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా విడాకుల వేళ… రేణూ దేశాయ్ పోస్ట్ నెట్టింట వైరల్!
-
రియల్ ఎస్టేట్లో నష్టాలు.. ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య
