Homeఆంధ్ర ప్రదేశ్విజయసాయి రెడ్డిపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు.. బీజేపీ పంపిన ఏజెంట్ అంటూ తీవ్ర విమర్శలు!

విజయసాయి రెడ్డిపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు.. బీజేపీ పంపిన ఏజెంట్ అంటూ తీవ్ర విమర్శలు!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్ :- విజయసాయి రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు మరియు రాజకీయ పరిణామాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి మళ్ళీ తెరపైకి ఎందుకు వచ్చారని ఆయన నిలదీశారు. గతంలో భారీగా అక్రమాలు జరిగాయని, వేల కోట్ల రూపాయలు దోచుకున్నారనే తీవ్ర ఆరోపణలు ఉన్నప్పటికీ సీబీఐ ఎందుకు సరైన విచారణ జరపడం లేదని కేఏ పాల్ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డి బీజేపీ పంపిన ఏజెంట్ అని తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ఓట్లను చీల్చేందుకే ఆయన కొత్త ఎత్తుగడలతో రాజకీయాల్లోకి మళ్లీ అడుగుపెట్టారని మండిపడ్డారు. కేవలం కొద్దిమంది వ్యక్తులు మాత్రమే దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, సామాజిక వర్గాల ప్రాతినిధ్యంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు, కాపులకు మరియు ఇతర బలహీన వర్గాలకు గతంలో ఏ పార్టీలు సముచిత అవకాశాలు కల్పించాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన కొద్దిమంది నాయకులే దశాబ్దాల తరబడి అధికారంలో ఉంటూ వస్తున్నారని, ఇతర వర్గాలకు రాజకీయ అధికారం దక్కకుండా అడ్డుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. మిగతా వర్గాలకు నాయకత్వం వహించే అర్హత లేదా? మాకు చేతకాదా? అంటూ కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

పండుగల వేళ కాలుష్య చర్చపై మండిపడ్డ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు