మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ (57) కన్నుమూశారు. కొచ్చిలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. సినిమా షూటింగ్లో పాల్గొంటున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలడంతో చిత్ర బృందం వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించింది. అయితే వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆయనను కాపాడలేకపోయారు.
షాజీ కుమార్ మలయాళ సినీ రంగంలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు. తన కెమెరా పనితనంతో ఎన్నో చిత్రాలకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చారు. ముఖ్యంగా ‘మన్యం పులి’, ‘నరన్’, ‘ఒడియన్’ వంటి ప్రముఖ చిత్రాలతో పాటు 50కి పైగా సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆయన అందించిన విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు దర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.
షాజీ కుమార్ మరణవార్త తెలుసుకున్న కేరళ ముఖ్యమంత్రి సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు.
ఒక సినిమా షూటింగ్లో పనిచేస్తూనే ఆయన తుదిశ్వాస విడవడం సినీ వర్గాలను కలచివేసింది. ఆయన మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమ ఓ ప్రతిభావంతుడైన సినిమాటోగ్రాఫర్‌ను కోల్పోయింది. షాజీ కుమార్ మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
also read: పవన్ కల్యాణ్‌తో విడాకుల ప్రకటన.. సోషల్ మీడియా ఖాతాను తొలగించిన అన్నా కొణిదెల!
