Homeతెలంగాణఅనంత‌పురంలో బీజేపీ మేయ‌ర్ అభ్య‌ర్థి ఓట‌మి...! సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్‌...

అనంత‌పురంలో బీజేపీ మేయ‌ర్ అభ్య‌ర్థి ఓట‌మి…! సీఎం చంద్ర‌బాబు సీరియ‌స్‌…

  • కొంపముంచిన క్రాస్ ఓటింగ్…!

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: అనంతపురం కార్పొరేషన్ లో బిజెపి మేయర్ అభ్యర్థి ఎందుకు ఓడిపోయారు? అక్కడ కూటమి మెజారిటీ డివిజన్లను గెలుచుకున్నా.. మేయర్ అభ్యర్థి విషయంలో ఎందుకు చతికల పడింది? పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ జరిగిందా? కూటమి కార్పొరేట్ అభ్యర్థులే క్రాస్ ఓటింగ్ కు ప్రోత్సహించారా? పొలిటికల్ వర్గాల్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా.. 13 కార్పొరేషన్లలో 12 చోట్ల కూటమి పార్టీలు విజయం దక్కించుకున్నాయి. వీటిలో మెజారిటీ స్థానాలను టిడిపి కైవసం చేసుకుంది. విజయవాడ, ఏలూరులో మాత్రమే జనసేన గెలిచింది. అయితే టిడిపికి కంచుకోట వంటి అనంతపురంలో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కడం ఆ పార్టీకి ఇప్పుడు సంకట స్థితిగా మారింది. దీనిపై అధినేత చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. తెర వెనుక ఏం జరిగింది అనే దానిపై నివేదికలు తెచ్చుకుంటున్నారు. కూటమి పార్టీల కార్పొరేట్ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. డివిజన్లో కార్పొరేటర్ కు ఓటు వేసి.. మేయర్ ఓటు విషయంలో మీ ఇష్టం అన్నట్టు కొందరు వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

టిడిపికి బలం…

వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టిడిపి కూటమి ఏకపక్షంగా విజయం సాధించింది. అనంతపురం నగరంలో కూడా పార్టీకి మంచి పట్టు ఉంది. అయితే ఆ కార్పొరేషన్ ను బిజెపికి కేటాయించారు. ఆ పార్టీ అభ్యర్థిగా అజిష్ బాబు పోటీ చేశారు. టిడిపికి బలమైన నగరాన్ని బిజెపికి కేటాయించడంపై తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందారు. కొంతవరకు సహాయ నిరాకరణ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో టిడిపి శ్రేణులు ప్రచారంలో పాల్గొన్నాయి. కానీ ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రమేష్ గౌడ్ సంచలన విజయం నమోదు చేసుకున్నారు. ఏకంగా 5981 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అదే సమయంలో 62 డివిజన్లలో 37 చోట్ల టిడిపి విజయం సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 21 చోట్ల మాత్రమే గెలిచింది. అయినా సరే వైఎస్ఆర్సిపి మేయర్ అభ్యర్థి గెలవడంపై ఇప్పుడు కూటమిలో బలమైన చర్చ నడుస్తోంది.

కొందరు నేతల తీరుతోనే…

కూటమి పార్టీ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ కు 62,219 ఓట్లు వచ్చాయి. బిజెపి అభ్యర్థి ఆజిస్ బాబుకు 56,238 ఓట్లు వచ్చాయి. టిడిపి కూటమి కార్పొరేట్ అభ్యర్థులకు ఓట్లు వేసిన ఓటర్లలో కొందరు.. మేయర్ అభ్యర్థి విషయానికి వచ్చేసరికి వైయస్సార్సీపీకి మద్దతుగా ఓటు వేశారని స్పష్టమవుతుంది. కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం, ఓట్ల బదిలీ సరిగ్గా జరగకపోవడం వంటి కారణాలతోనే బిజెపి అభ్యర్థి ఓడిపోయారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. అనంతపురంలో జరిగిన వ్యవహారంపై నివేదిక తెచ్చుకున్నారు. కొందరు నేతలు తీరుపై అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. చర్యలకు ఉపక్రమించే అవకాశం కూడా ఉంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  సీఎం డీకే శివ‌కుమార్ తీరుపై భక్తుల ‘శివ’తాండవం…!
  2.  ఏపీలో ఇక కాంగ్రెస్…!
  3. తెలంగాణ ఆర్థిక స్థితి మరియు సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  4.  ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు