-
కర్ణాటక సీఎం డీకే శివకుమార్ పై కట్టలు తెంచుకున్న ఆగ్రహం
-
హాసనాంబ దేవస్థానంలో ఘటన
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: ప్రజాగ్రహానికి ఎవరు అతీతులు కాదు. ఇప్పుడు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సైతం ప్రజాగ్రహానికి గురయ్యారు. ప్రజల ఆగ్రహాన్ని ప్రత్యక్షంగా చూశారు. కర్ణాటకలోని ప్రసిద్ధ హాసనాంబ ఆలయాన్ని ఏడాదికి ఒక్కసారి తెరుస్తారు. అమ్మవారి దివ్య దర్శనం కోసం పిల్లాపాపలు, వృద్ధులతో సహా వేలాదిమంది భక్తులు ఆకలి దప్పులతో, అలసటతో మహిళకొద్ది బారికేడ్లలో గంటల తరబడి ఉంటారు. అయితే సాధారణ భక్తుల దర్శనాలను నిర్దాక్షిణ్యంగా నిలిపివేసి… సీఎం డీకే శివకుమార్ బృందానికి రెడ్ కార్పెట్ వేసి రాచ మర్యాదలు చేయడంతో.. భక్తులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తీరుపై తీవ్రంగా ఆక్షేపించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే సంచలన వార్తగా మిగిలింది.
ఏర్పాట్లలో విఫలం…
ప్రసిద్ధ ఆలయంగా పేరు పొందిన ఆ ఆధ్యాత్మిక కేంద్రం వద్ద ఏర్పాట్లలో ప్రభుత్వం విఫలమయింది. పైగా ఆర్భాటం చేయడం భక్తుల్లో ఆగ్రహం పెరిగింది. పుణ్యం దక్కుతుందన్న ఆశతో తెల్లవారుజాము నుంచి కాళ్ళరిగేలా క్యూ లైన్ లలో పడిగాపులు కాస్తున్న వేలాది మందికి.. కనీసం తాగునీరు, ప్రాథమిక వసతులు కల్పించడంలో యంత్రాంగం దారుణంగా విఫలమైంది. గంటలు గడుస్తున్నా లైన్లు ఇసుమంతైనా కదలకుండా.. సామాన్యులను తొక్కిసలాటలో నెట్టేసిన అధికారులు.. అదే సమయంలో ప్రజా ప్రతినిధులు, వారి అనుచర గణానికి ప్రత్యేక దారులు గుండా గర్భగుడిలోకి దర్జాగా ప్రవేశం కల్పించడం భక్తులకు కడుపు మంటను రగిలించింది. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడి స్క్రీన్ పై డీకే శివకుమార్ వీఐపీ ఘర్షణ దృశ్యాలు ప్రసారం కావడం భక్తుల్లో మరింత ఆగ్రహానికి కారణమైంది.
స్క్రీన్ లపై బూట్లు విసిరిన వైనం…
గర్భగుడిలో ప్రజా ప్రతినిధులు దైవ సన్నిధిని తమ ప్రైవేటు ప్రోటోకాల్ వేదికగా మార్చుకుని.. నింపాదిగా పూజలు చేసుకుంటున్న విజువల్స్ కనిపించగానే లైన్లో ఉన్న భక్తులు ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. భక్తులు ఏకంగా తమ కాళ్లకు ఉన్న చెప్పులు, బూట్లను తీసి డీకే శివకుమార్ ముఖం కనిపిస్తున్న ఆ భారీ స్క్రీన్ లపై విసిరి కొట్టారు. దేవుడు ముందు ధనిక, పేద… పాలకుడు- ప్రజలు అన్న తేడాలు ఉండకూడదు అన్న కనీసం న్యాయాన్ని పాలకులు మరిచిపోతే.. డీకే శివకుమార్ కు ఎదురైన పరిణామమే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ఘటనతో డీకే శివకుమార్ ఇమేజ్ కు డ్యామేజ్ కలిగింది. ఇటీవల ఆయన హిందుత్వవాదానికి బలంగా నమ్ముతున్నారు. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం నిజంగా ఆయనకు ఇబ్బందికరమే.
ఇవి కూడ చదవండి:
-
నూతన సంవత్సరంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరశం ఖం..!
-
ఏపీలో ఇక కాంగ్రెస్…!
-
తెలంగాణ ఆర్థిక స్థితి మరియు సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!
