Hometelanganaకేటీఆర్, కేసీఆర్‌లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

కేటీఆర్, కేసీఆర్‌లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

క్రైమ్ మిర్రర్,తెలంగాణ :- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రత్యర్థి నాయకులపై, ముఖ్యంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరియు మాజీ సీఎం కేసీఆర్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ విమర్శలు చేస్తూ ఆయన బాహాటంగానే ఘాటు వ్యాఖ్యలు చేశారు.

“కేటీఆర్ పది జన్మలెత్తినా రేవంత్ రెడ్డి కాలేడు”

కేటీఆర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, “కేటీఆర్ పది జన్మలు ఎత్తినా రేవంత్ రెడ్డి కాలేడు” అని సవాలు విసిరారు. వయస్సు, రాజకీయ పరిణతి గురించి ప్రస్తావిస్తూ—”ఆయనకు గడ్డం రావడానికే 50 ఏళ్లు పట్టింది. మరి బుద్ధి రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో?” అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

రేవంత్ రెడ్డిలా మారడం ఎవరికీ అంత సులభం కాదని పేర్కొంటూ, “గడ్డం మోకాళ్ల దాకా వచ్చినా, తాటి చెట్టుకు ఉరేసుకున్నా, ఆత్మహత్య చేసుకున్నా నువ్వు ఎప్పటికీ రేవంత్ రెడ్డివి కాలేవు. రేవంత్ రెడ్డి కావాలంటే గుండె ధైర్యం ఉండాలి, ప్రజా సమస్యలపై పోరాడే మనస్తత్వం ఉండాలి” అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌కు సూచన

అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. “నువ్వైనా చెప్పు కేసీఆర్.. ఆయనతో గంజాయి మాటలు మాట్లాడడం బంద్ చేయించు” అని సూచించారు. రాజకీయాల్లో విమర్శలు చేసేటప్పుడు హుందాతనం ఉండాలని, అనవసరమైన వ్యాఖ్యలు బంద్ చేయాలని హెచ్చరించారు.కొడంగల్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు