ఒకప్పుడు తనదైన నటన, డ్యాన్స్‌తో దక్షిణాది సినీ ప్రేక్షకులను అలరించిన నటి డిస్కో శాంతి మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆమె సినిమాల్లోకి తిరిగి అడుగుపెడుతున్నారు. రాఘవ లారెన్స్, ఎల్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘బుల్లెట్’ చిత్రంతో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా తెలుగులో ‘బుల్లెట్టు బండి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో డిస్కో శాంతి ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆమె మంత్రగత్తె పాత్రను పోషిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నటుడు ఎల్విన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా డిస్కో శాంతి రీఎంట్రీ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
డిస్కో శాంతి చివరిసారిగా 1997లో విడుదలైన కన్నడ చిత్రం ‘యుద్ధ’లో నటించారు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆమెను వెండితెరపై చూడబోతుండటంతో అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది.
ఇక రాఘవ లారెన్స్, ఎల్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘బుల్లెట్’ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు డిస్కో శాంతి రీఎంట్రీ కూడా ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా మారనుంది. ఆమె పాత్ర ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
also read: నాచారంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ.20 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం!
