Homeతెలంగాణతెలంగాణను ముంచెత్తుతున్న తుఫాన్ వర్షాలు: పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన IMD!

తెలంగాణను ముంచెత్తుతున్న తుఫాన్ వర్షాలు: పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన IMD!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాబోయే గంటల్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ముందస్తు జాగ్రత్తగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని IMD స్పష్టం చేసింది. ఈ జిల్లాల ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరొకవైపు, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సంగారెడ్డి, మెదక్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల తీవ్రత కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

నీతా అంబానీ ఉదారత: ముంబైలో 100 ఎకరాల్లో ‘అనంత ఆశ్రయ్’ ప్రాజెక్ట్ ప్రారంభం!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లు పట్టివేత

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు