పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ తల్లికైనా నిజమైన ఆనందం లభిస్తుందని నీతా అంబానీ పేర్కొన్నారు. ఒక తల్లిగా ఆ విషయాలు తనకు సంపూర్ణంగా తెలుసని ఆమె వెల్లడించారు. తల్లిదండ్రులు పక్కన లేకపోయినప్పటికీ, ప్రతి బిడ్డ తల్లితండ్రుల ప్రేమకు అర్హులేనని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ ఆలోచనతోనే, కుటుంబ ఆసరా లేని నిరుపేదలకు మరియు అనాథలకు తోడ్పాటునందించేందుకు ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం ముంబైలో 100 ఎకరాల విస్తీర్ణంలో ‘అనంత ఆశ్రయ్’ అనే ప్రత్యేక ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నీతా అంబానీ ప్రకటించారు.
ఆర్థిక భద్రతకు పొదుపే మార్గం: ఈఎంఐల భారం తగ్గించుకోవాలని నిపుణుల సూచన!
తన పుట్టినరోజు సందర్భంగా నీతా అంబానీ ఈ భారీ ప్రాజెక్టుకు స్వయంగా శంకుస్థాపన చేశారు. ఈ ‘అనంత ఆశ్రయ్’ కేంద్రంలో అనాథలు, వృద్ధులు సహా మొత్తం 5,000 మందికి ఉచితంగా వసతి, సంరక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. సమాజంలో ఆసరా లేని వారికి నీతా అంబానీ అందిస్తున్న ఈ సహకారం పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
28 ఏళ్ల క్రితం హత్య చేసి పరారీ.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు
