Homeఆంధ్ర ప్రదేశ్27 ఏళ్ల తర్వాత అక్కడ టిడిపి జెండా...!

27 ఏళ్ల తర్వాత అక్కడ టిడిపి జెండా…!

  • కడప జడ్పిపీఠం టిడిపి ఖాతాలోకి

  • 23 జడ్పీటీసీలు ఏకగ్రీవం

  • పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రాక చేతులెత్తేసిన వైసిపి

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే షాక్ తగిలింది. జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాక కడప జడ్పీ పీఠాన్ని తెలుగుదేశం కూటమి కైవసం చేసుకుంది. సరికొత్త రాజకీయ చరిత్రను సృష్టించింది. వైయస్ కుటుంబానికి తిరుగులేని రాజకీయ కంచుకోటగా ఉంటూ వచ్చిన కడప జిల్లా పరిషత్ పీఠాన్ని.. 27 ఏళ్ల విరామం తర్వాత తెలుగుదేశం పార్టీ తిరిగి కైవసం చేసుకుంది. జిల్లా పరిధిలోని మొత్తం 39 జడ్పిటిసి స్థానాలకు గాను.. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే సమయానికి ఏకంగా 23 స్థానాలు టిడిపి ఖాతాలోకి ఏకగ్రీవంగా చేరిపోయాయి. దీంతో పోలింగ్ నిర్వహణకు ముందే స్పష్టమైన సంపూర్ణ మెజారిటీని అధిగమించిన కూటమి.. కడప జడ్పీ చైర్మన్ పీఠాన్ని అధికారికంగా సొంతం చేసుకుంది.

కీలక నియోజకవర్గాల్లో…

కడప జిల్లా వ్యాప్తంగా కీలక నియోజకవర్గాల్లో జడ్పిటిసి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కమలాపురం నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో ఆరు జడ్పిటిసి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. జమ్మలమడుగులో 4, పులివెందులలో మూడు, మైదుకూరులో మూడు, బద్వేలులో మూడు, రాజంపేటలో రెండు, ప్రొద్దుటూరులో రెండు జడ్పీటీసీలు ఏకగ్రీవంగా టిడిపి వశం అయ్యాయి. గతంలో నామినేషన్ వేయడానికి భయపడే పరిస్థితులు ఉన్న ఈ ప్రాంతాల్లో.. ఏకంగా 23 మండలాల్లో ప్రత్యర్థి ఎవరు బరిలో నిలవకపోవడం క్షేత్రస్థాయిలో వచ్చిన అనూహ్య రాజకీయ మార్పును స్పష్టం చేస్తోంది.

క్షేత్రస్థాయిలో చతికిలపడి…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లా కడప. అక్కడ ఎంత ఘోరంగా కుప్పకూలిపోవడం చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పదే పదే సవాళ్లు విసురుతూ వచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో వైసిపి చేతులెత్తేసింది. సగానికి పైగా మండలాల్లో కనీసం పోటీ ఇచ్చేందుకు అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి. దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కడప జిల్లా పై పసుపు జెండా సగర్వంగా ఎగరనుంది. 1990 చివరినాటి తర్వాత మళ్లీ ఇప్పుడు కడప జిల్లా పరిషత్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే సువర్ణ అవకాశం టిడిపికి దక్కనుంది.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు