కోల్కతా, క్రైమ్మిర్రర్: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని హత్య చేసేందుకు కుట్రజరిగిందని టీఎంసీ నేతలు ఆరోపించారు. కోల్కతాలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసం వెలుపల ఈఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో పార్టీ నేతల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ హత్యకు కుట్ర ఎవరి పని అని వారు ఆరా తీస్తున్నారు. కాగా దుర్గాపూజ మండపం ప్రారంభోత్సవానికి మమతా బెనర్జీ బయలుదేరుతున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం కలవరం రేపింది. టీఎంసీ నేతలు, కార్యకర్తలు తెలిపిన వివరాల ప్రకారం ఒక యువతి కాళీఘాట్లోని మమత ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఆమె మమత చీరను లాగేందుకు ప్రయత్నించిందని, సదరు మహిళ తన చీరలో ఒక కత్తిని దాచి ఉంచినట్లు గుర్తించామని పార్టీ శ్రేణులు తెలిపాయి. వెంటనే అప్రమత్తమైన టీఎంసీ నేతలు, కార్యకర్తలు ఆ మహిళను పట్టుకుని కాళీఘాట్ పోలీసులకు అప్పగించారు.
ఇవి కూడ చదవండి:
-
పూణెలో దారుణం.. కట్నం వేధింపులు భరించలేక మహిళా ఐటీ ఇంజనీర్ ఆత్మహత్య!
-
ప్రమాదకర స్థాయిలో ఎల్నినో….!ఏపీ రైతుల కిడ్నీలపై తీవ్ర ప్రభావం…! నిపుణులు ఏం చెబుతున్నారంటే…
-
మీ అకౌంట్లో డబ్బులు లేవా…! క్రెడిట్ లైన్ విధానంతో పేమెంట్స్…! అది ఎలాగంటే…
-
దర్శకుడు త్రినాథరావుపై నటి సంచలన ఆరోపణలు…! అసలు ఏం జరిగిందంటే…
