– మట్టి కుంటలపై కుమ్మర్లకు హక్కు కల్పించాలి
– కుమ్మర్ల ఆరాధ్యదైవం అయినా ఆతుకూరి మొల్లమాంబ విగ్ర ప్రతిష్టకు సంపూర్ణ మద్దతు
– కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయించిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కృషి మరువలేనిది
– వనపర్తి జిల్లా కుమ్మర సంఘం నాయకులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం అధ్యక్షులు నడికుడి జయంతి రావు. ప్రధాన కార్యదర్శి దయానంద్. వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం. పిలుపుమేరకు. వనపర్తి జిల్లా అధ్యక్షులు సుగురు రాములు. ప్రధాన కార్యదర్శి సూర్యవంశం పరుశరాముడు. గౌరవ సలహాదారులు. ఫైర్ ఇంజన్ నరసింహ. బుద్ధారం నరసింహ. బొడ్డుపల్లి వెంకటేష్. యూత్ అధ్యక్షుడు రామకృష్ణ. ప్రధాన కార్యదర్శి. సూర్యవంశం రాముడు. ఆధ్వర్యంలో కుమ్మరుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించే దిశగా ఆతుకూరి మొల్లమాంబ విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఎమ్మెల్యే మెఘారెడ్డి. 13వ వార్డు కౌన్సిలర్ బొడ్డుపల్లి పరశురాం చొరవతొ వనపర్తి మున్సిపల్ 33 మంది కౌన్సిల్‌లో తీర్మానం చేయించడం పట్ల వనపర్తి కుమ్మర సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు,ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి శాలువాతో ఘనంగా సన్మానం చేసి వనపర్తి జిల్లా కుమ్మరి సంఘం నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.వనపర్తి జిల్లాలో తరతరాలుగా కుమ్మరి వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న కుటుంబాల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ,చూపాలని కుమ్మరి వృత్తికి ప్రధాన ఆధారమైనటువంటి మట్టి లభ్యత రోజురోజుకూ కష్టతరంగా మారడంతో,మట్టి లభించే కుంటలు,చెరువుల నుంచి కుమ్మరులకు ఉచితంగా మట్టి పొందే అవకాశం కల్పించాలని, అలాగే మట్టిని తమ గ్రామాలకు, తరలించేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని కుమ్మరి సంఘం నాయకులు ఎమ్మెల్యే మేఘారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
కుమ్మర్లకు మట్టి కష్టాలుతీర్చేందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి అండ
కుమ్మర్ల వినతిపై స్పందించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి,వనపర్తి పట్టణ పరిధితో పాటు,వనపర్తి జిల్లా పరిధిలో మట్టి లభించే కుంటలు,చెరువులను గుర్తించి, కుమ్మరులకు అవసరమైన మట్టి ఉచితంగా లభించేలా సంబంధిత అధికారుల ద్వారా తగిన సదుపాయాలు కల్పించేందుకు ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కుమ్మరి వృత్తిదారుల ప్రధాన డిమాండ్లను కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకెళ్లి తీర్మానం చేయించడమే కాకుండా,వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చూపుతున్న చొరవ మరువలేనిదని వనపర్తి కుమ్మరి సంఘం నాయకులు ఆశ బావ వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కోశాధికారి సూర్యవంశం శ్రీనివాసులు. రాజకీయ విభాగం అధ్యక్షుడు రఘు. రవికుమార్. 15 మండల అధ్యక్షులు. సత్యన్న , శివ శ్రీనివాసులు. ఆంజనేయులు. రాములు. వెంకటయ్య.యూత్ అధ్యక్షులు. నరేందర్. రామకృష్ణ. సురేష్. ఈశ్వర్. విష్ణువర్ధన్. చంద్రశేఖర్. నరేష్. నాగరాజు. కుల బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఢిల్లీ మెట్రోలో దారుణం.. సీటు గొడవలో వ్యక్తి మృతి, రిటైర్డ్ ఐఏఎస్ అరెస్ట్!
