Homeఅంతర్జాతీయంకాంగ్రెస్ కు 'కాక్రోచ్' తలనొప్పి...!

కాంగ్రెస్ కు ‘కాక్రోచ్’ తలనొప్పి…!

  • ఆప్ మాదిరిగా నష్టం తప్పదు అన్న భయం

  • వారితో వేదిక పంచుకునేందుకు ఇష్టపడని హస్తం

  • ఏఐసీసీ పెద్దల వ్యూహం అదే

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: జాతీయస్థాయిలో బిజెపిని పడగొట్టాలన్న ఆశయంతో పని చేస్తున్న రాజకీయ పార్టీల మధ్య విభేదాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంతో కొత్తగా పుట్టుకొచ్చిన జనతా కాక్రోచ్ గట్టిగానే తలపడుతుండడం విశేషం. బిజెపికి వ్యతిరేకంగా వెళ్లే క్రమంలో వారి మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన పిలుపు ఉద్రిక్తతలకు కారణం అవుతోంది.

ఓటర్ల జాబితాల సవరణలు అవకతవకలు జరిగాయి అంటూ యువత, విద్యార్థి సంఘాలతో కలిసి సిజెపి తలపెట్టిన ఈ ఆందోళనను అణచివేసేందుకు కేంద్ర హోం శాఖ, ఢిల్లీ పోలీసులు అసాధారణ రీతిలో భద్రత ఆంక్షలు విధించారు.

జంతర్ మంతర్ పరిసరాల్లో నాలుగు కిలోమీటర్ల మేర మొబైల్ ఇంటర్నెట్ సేవలను 24 గంటలపాటు నిలిపివేశారు. సెక్షన్ 163 విధించారు. సరిహద్దుల్లో రైళ్లు, వాహనాల రాకపోకలను కట్టుదిట్టం చేశారు.

ఢిల్లీకి ఎవరూ చేరకుండా దేశవ్యాప్తంగా వేలాదిమందిని ముందస్తుగా నిర్బంధించారు. సాధారణ రాజకీయ పక్షాల కంటే ఈ సోషల్ మీడియా యూత్ ఆధారిత కాక్రోచ్ ఆందోళనపై కేంద్ర ప్రభుత్వం ఆందోళనకు గురవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

  • గత కొద్ది రోజులుగా ఆందోళన..

జాతీయ ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి గత కొద్ది రోజులుగా రాజధాని ఢిల్లీలో హడావిడి చేస్తున్నాయి. అయితే లక్ష్యం ఒకటే కానీ కాక్రోచ్ పార్టీతో వేదిక పంచుకునేందుకు కానీ.. వారితో ప్రత్యక్షంగా కలిసి పోరాడేందుకు కానీ కాంగ్రెస్ నాయకత్వం సాహసించడం లేదు.

పైకి చూస్తే అది రాజకీయ రహిత నిరసన. అందులో మేం కలిస్తే రాజకీయ రంగు పులుముకుంటుందని ఇరువర్గాలు చెబుతున్నాయి. కానీ అసలు కథ వేరే ఉందనేది ఢిల్లీ వర్గాల మాట.

వ్యవస్థాపక నిర్మాణం, దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టి.. ఈ యువతరం ఉద్యమకారులు మైలేజ్ కొట్టేస్తారేమోనన్న అంతర్గత అభద్రతాభావం హస్తము దళంలో ఉంది.

  • ఆ భయం అధికం..

జనతా కాక్రోచ్ పార్టీతో కలిసి ఉమ్మడిగా నిరసనకు దిగితే.. మీడియాతో పాటు సోషల్ మీడియా దృష్టి మొత్తం సహజంగానే కాక్రోచ్ నేతల వైపు మల్లుతుంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీ ఉనికి మరింత ప్రమాదంలో పడినట్టే. ప్రతిపక్ష గళాన్ని సోషల్ మీడియా యువత హైజాక్ చేస్తారన్న ఆందోళన ఏఐసీసీ వ్యూహకర్తల్లో ఉంది.

గతంలో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం ఉద్యమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని భర్తీ చేసింది. ఢిల్లీతోపాటు పంజాబ్ లాంటి చోట్ల కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయింది. అందుకే ఇప్పుడు ఎన్నికల కమిషన్ పై పోరాటంలో ప్రధాన క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకే దక్కాలి తప్ప.. జనతా కాక్రోచ్ కు దక్కకూడదు అనేది కాంగ్రెస్ పెద్దల వ్యూహం.

అయితే బిజెపికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన జనతా కాక్రోచ్.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సైతం ఇబ్బంది పెడుతోంది. ఈ రెండు పార్టీల వ్యూహం అంతిమంగా బిజెపికి కలిసి వచ్చేలా ఉంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు