HomeUncategorizedఇద్ద‌రు విద్యార్థినుల అదృశ్యం...! శంషాబాద్‌లో క‌ల‌క‌లం...

ఇద్ద‌రు విద్యార్థినుల అదృశ్యం…! శంషాబాద్‌లో క‌ల‌క‌లం…

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: హైద‌రాబాద్‌లోని శంషాబాద్ ప‌రిధిలోని నర్కుడ సమీపంలోని ఓ మహిళా మండలి రీహాబ్‌ సెంటర్‌లో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు 14 ఏళ్ల బాలికలు అదృశ్య‌మైన సంఘ‌ట‌న ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం రేపుతోంది. ఈ నెల 8వ తేదీ రాత్రి డైనింగ్‌ హాల్‌కు వెళ్తున్న సమయంలో వారు అదృశ్యమైనట్లు సమాచారం. కాగా ఈ సెంట‌ర్‌లో 50 మంది బాలిక‌లు ఉంటూ విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. . రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా భోజనం చేసేందుకు వెళ్లిన ఇద్దరు బాలికలు తిరిగి కనిపించకపోవడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే సెంటర్‌ పరిసర ప్రాంతాలతో పాటు సమీప ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. అయినప్పటికీ బాలికల ఆచూకీ లభించకపోవడంతో నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు.

సెంటర్‌ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శంషాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన బాలికలు ఎక్కడికి వెళ్లారు? వారు స్వచ్ఛందంగా వెళ్లిపోయారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. బాలికలు కనిపించకుండా పోయిన సమయంలో జరిగిన పరిణామాలు, సెంటర్‌ పరిసరాల్లోని పరిస్థితులు, అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తూ వారి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. రంగారెడ్డి జిల్లాలో విషాదం.. లిఫ్ట్ కింద పడి కార్మికుడు మృతి
  2. నానా పటేకర్‌పై తనుశ్రీ దత్తా వ్యాఖ్యల దుమారం.. విమర్శల మధ్య తన వైఖరికి కట్టుబాటు!
  3. వారణాసి కోసం రాజమౌళి మరో సంచలనం.. మహేశ్‌బాబు సినిమా కోసం ప్రత్యేక భాష?
  4. బండి సాయి భగీరథ్‌ కేసులో హైకోర్టు ఆదేశాలు.. సోషల్ మీడియా ప్రచారంపై కీలక నిర్ణయం

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు