వికారాబాద్, క్రైమ్‌మిర్రర్: ప్రేమపేరుతో యువకుడి టార్చర్ భరించలేక యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం రావులపల్లి గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. యువకుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఊరి శివారులోని బావిలో దూకి యువతి బలవన్మరణానికి పాల్పడింది. చరణ్ అనే యువకుడు యువతికి ఫోని చేసి వేధించడం వల్లనే అఘాయిత్యానికి పాల్పడిందనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి బయటకు రావాలంటూ యువతికి పదే పదే ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. దీంతో వేధింపులు తట్టుకోలేక మనస్తాపం చెంది ఆమె ప్రాణాలు తీసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈతగాళ్ల సాయంతో యువతి మృతదేహాన్ని బాలిలో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఇవి కూడ చదవండి:
- రీల్స్ మోజులో క్వారీలో మునిగి విద్యార్థి మృతి…!
-
అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష..!
-
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాగమణి అదృశ్యం.. ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష బహుమతి ప్రకటించిన భర్త
-
40 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి.. స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచిన ఆర్టీసీ డ్రైవర్!
