Homeఅంతర్జాతీయంజెన్ జీ ఎక్కడ...?!

జెన్ జీ ఎక్కడ…?!

  • కాక్రోచ్ ఉద్యమం వెనుక రాజకీయ పార్టీలు

  • బెంగళూరు సభలో లెఫ్ట్, ఆప్ రెగ్యులర్ యువ కార్యకర్తలు

  • ప్రకాష్ రాజ్, యూట్యూబర్ ధృవ్ లాఠీతోనే

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: దేశవ్యాప్తంగా ఉప్పెనలా మారింది జనతా కాక్రోచ్ ఉద్యమం. యువతరం గొంతుకను, సామాజిక మార్పు కోసం అంటూ సోషల్ మీడియా వేదికగా భారీ హడావిడి నడిచింది. నూతన తరానికి ప్రతినిధులు అంటూ.. జెన్ జీ ఆశయాలకు వారసులం అంటూ ఎన్నో రీల్స్, వీడియోలతో హల్ చల్ చేసింది ఈ వర్గం.

తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెబుతూ.. దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా యువతను మేలుకొలుపుతూ.. యువత ప్రాతినిధ్యం పెరగాలని కోరుతూ పెద్ద ఉద్యమమే ఊపందుకుంది. కానీ ఈ కాక్రోచ్ ఉద్యమం వెనుక పూర్తిగా రాజకీయ పార్టీలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. బెంగళూరులో జరిగిన ప్రదర్శనలతో ఇది స్పష్టమైంది.

ఇప్పటివరకు ఆమ్ ఆద్మీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీల రాజకీయ భావజాలానికి కట్టుబడి పనిచేస్తున్నట్లు స్పష్టమైంది. కేవలం సోషల్ మీడియాలో వైరల్ వ్యూస్ కోసం యువతను ఆకర్షించిన వీరు.. చివరికి వివాదాస్పద నటుడు ప్రకాష్ రాజ్, యూట్యూబర్ ధృవ్ రాఠీ లాంటి అజెండా రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం పావులుగా మారుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్కడ కనిపించింది వారే..

తాజాగా బెంగళూరులో ఓ నిరసన కార్యక్రమం జరిగింది. జెన్ జీ పేరుతో భారీ ఉద్యమం చేస్తున్నట్లు చెప్పుకున్న ఈ సభలో పాల్గొన్న వారంతా కేవలం లెఫ్ట్, ఆప్ పార్టీలకు చెందిన రెగ్యులర్ యువ కార్యకర్తలు. అసలైన జనరేషన్ జెడ్ యువత ఎక్కడా కనిపించలేదు.

సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసి అమాయక విద్యార్థులను, యువతను నోటెడ్ పొలిటికల్ ప్రాపగండా కోసమే వాడుకుంటున్నారనే వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఎవరికోసం అయితే ఈ పోరాటాలు చేస్తున్నామని చెప్పుకుంటున్నారో.. మా కంటెంట్ అంతా నిర్దిష్టమైన కొన్ని రాజకీయ శక్తులకు అనుకూలంగా ఉంటుంది. మోడీపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఫ్యాషన్ గా మారింది.

  • స్వతంత్ర ఆలోచనలతో..

బెంగళూరులో జరిగిన కార్యక్రమం వెనుక నటుడు ప్రకాష్ రాజ్, సోషల్ మీడియాలో ఒక వర్గాన్ని బ్రెయిన్ వాష్ చేస్తే ధ్రువ్ లాఠీ ఉన్నారు అనేది బహిరంగ రహస్యం. స్వతంత్ర ఆలోచనలతో ముందుకు వస్తున్నట్లు నటిస్తూనే.. తెర వెనుక కమ్యూనిస్ట్, ఆపు భావజాల నేతల స్క్రిప్టులను అమలు చేయడం వీళ్ళ అసలు పని అని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

తాము కేవలం ఒక వర్గం రాజకీయ ప్రయోజనాల కోసం.. కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్న వ్యక్తుల డైరెక్షన్లో పనిచేసే అనుబంధ సంఘంగా మారిపోయామని.. మీరు తమ చర్యల ద్వారా రుజువు చేసుకుంటున్నారు.

తమ స్వార్ధ రాజకీయ అజెండాను అమలు చేసేందుకు యువతను.. జెన్ జీ ట్రెండ్స్ ను కేవలం వస్తువులుగా వాడుకుంటున్న ఈ కాక్రోచ్ గ్యాంగ్ మోసాలను.. దేశంలోని యువత ఇప్పుడిప్పుడే పసిగడుతోంది. కేవలం సోషల్ మీడియా రీల్స్, డిజిటల్ స్టంట్ ల ద్వారా జనాలకు ఎక్కువ కాలం మధ్య పెట్టలేరని క్లారిటీ వస్తోంది. వీరి తీరుపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు