Homeజాతీయంప్ర‌పంచం భార‌త్‌వైపు చూస్తోంది...! న‌రేంద్ర మోది

ప్ర‌పంచం భార‌త్‌వైపు చూస్తోంది…! న‌రేంద్ర మోది

  • విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప స‌భ‌లో భావోద్వేగ ప్ర‌సంగం

  • 25 ఏళ్లుగా దేశ ప్ర‌జ‌ల సేవ‌లోనే ప్ర‌యాణం

  • ప్ర‌జ‌ల ఆశీర్వాద‌మే త‌న‌కు బ‌లం…

 

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: ప్ర‌పంచం మొత్తం ఇప్ప‌డు భార‌త్ వైపు చూస్తోంద‌ని పీఎం న‌రేంద్ర‌మోది అన్నారు. ఢిల్లీ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వ‌హించిన విక‌సిత్ భార‌త్ సంక‌ల్ప స‌భ‌లో ప్ర‌ధాని మోడీ పాల్గొని సేవా సంక‌ల్ప జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేశారు. 25 ఏళ్ల త‌న రాజ‌కీయ‌ ప్ర‌స్థానాన్ని పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఈ కార్య‌క్ర‌మానికి అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ కార్య‌క్ర‌మానికి సేవా సంక‌ల్ప యాత్రికులు వివిధ రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. కాగా స‌రిగా 25 ఏళ్ల క్రితం గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి గుర‌య్యారు. అప్ప‌టి నుంచి దేశ ప్ర‌జ‌ల సేవ‌ల‌నోనే త‌న 25 ఏళ్ల ప్ర‌యాణం కొన‌సాగింద‌ని పేర్కొన్నారు. త‌న‌కు పాతికేళ్ళ నిరంత‌రం సేవే చేసే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని తాను ఎప్పుడూ ఊహించ‌లేద‌ని అన్నారు. సుదీర్ఘ‌మైన ప్ర‌జా సేవ ప్ర‌స్థానం ప్ర‌జల ఆశీర్వాద బ‌ల‌మే అని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు.

ప్ర‌జా ఆశీస్సులే త‌న‌కు బ‌లం…

ప్రజల ఆశీస్సులు, పార్టీ శ్రేణుల మద్దతే తనకు బలమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని ఎన్నటికీ మరచిపోలేనని పేర్కొన్నారు. ప్రజా సేవ చేసేందుకు భగవంతుడు తనకు శక్తినిచ్చారని, ప్రజలు, దేవుడి ఆశీస్సులతో దేశానికి మరింత సేవ చేస్తానని తెలిపారు. ప్రతి ఘటన నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నానని, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపనతో ఉంటానని మోదీ చెప్పారు. సవాళ్లే తనను మరింత బలంగా నిలబెట్టాయని, దేశం తనకు ఎంతో ఇచ్చిందని.. దేశమే తనకు ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

సంక‌ల్పం ఏదైనా సాధించ‌వ‌చ్చు…

కలిసికట్టుగా పనిచేస్తే 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించగలమనే విశ్వాసం తనకు ఉందని ప్రధాని మోదీ అన్నారు. ‘వికసిత్ భారత్-2047’, టాప్-3 ఆర్థిక వ్యవస్థ, ఆత్మనిర్భర్ భారత్, ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగడం, అంతరిక్ష రంగంలో మరింత ముందుకు సాగడం వంటి లక్ష్యాలను సాధించేందుకు ‘వీ విల్ డూ ఇట్’ అంటూ ప్రతిజ్ఞ చేశారు. సంకల్పం ఉంటే దేనినైనా సాధించవచ్చని, దేశ ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని, దేశాభివృద్ధికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. పేదరికం, డ్రగ్స్‌ను దేశం నుంచి నిర్మూలించడం, అన్ని రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం వంటి పెద్ద లక్ష్యాలతో పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశానని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగుతానని మోదీ తెలిపారు.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్‌…! ఉద్యోగుల‌కు డీఏ పెంచుతూ ఉత్త‌ర్వు జారీ…
  2.  ఆళ్లగడ్డలో దారుణం.. చెత్తబుట్టలో శిశువు మృతదేహం
  3.  బేగంపేటలో దారుణం.. 8 ఏళ్ల కుమార్తెపై తండ్రి లైంగిక వేధింపులు
  4. AI ఫోటోలతో మహిళకు వేధింపులు.. ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎంపై కేసు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు