Homeక్రైమ్పడవ బోల్తా.. బాలుడితో సహా ముగ్గురు మృతి

పడవ బోల్తా.. బాలుడితో సహా ముగ్గురు మృతి

క్రైమ్ మిర్రర్ : నదిని దాటుతుండగా పడవ బోల్తాపడిన ఘటనలో పదేళ్ల బాలుడితో పాటు ముగ్గురు మృతి చెందిన విషాద ఘటన అస్సాంలోని లఖింపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ముగ్గురు వ్యక్తులు మార్కెట్‌లో విక్రయించేందుకు మేకలను తీసుకుని పడవలో మెర్బిల్ నదిని దాటేందుకు బయలుదేరారు. నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో మార్గమధ్యంలో పడవ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో పడవలో ఉన్న ముగ్గురూ నీటిలో గల్లంతయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) సిబ్బంది నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు గంటపాటు గాలించిన అనంతరం ముగ్గురినీ గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతులను డియోలియా గావ్‌కు చెందిన అజిత్ దత్తా (25), పోద్మా దత్తా (50), మిధుస్మి దత్తా (10)గా పోలీసులు గుర్తించారు. మృతులంతా బంధువులేనని, వారికి ఈత రాదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
also read : బిస్కెట్ గొంతులో ఇరుక్కొని ఏడాది చిన్నారి మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు