Homeజాతీయంఅరుదైన వ్యాధితో పోరాడుతున్న పసివాడికి రూ.9 కోట్ల సాయం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్న అనంత్ అంబానీ

అరుదైన వ్యాధితో పోరాడుతున్న పసివాడికి రూ.9 కోట్ల సాయం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్న అనంత్ అంబానీ

ప్రస్తుత రోజుల్లో మానవత్వం ఇంకా ఉందనడానికి అనంత్ అంబానీ చేసిన ఒక గొప్ప సాయమే నిదర్శనంగా నిలుస్తోంది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఒక పసివాడికి ఆయన అండగా నిలిచి తన మంచి మనసును చాటుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. 22 నెలల వయసున్న వేదాంశ్ సింగ్ అనే చిన్నారి ‘స్పెనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) టైప్-1’ అనే అత్యంత అరుదైన వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నాడు. ఈ ప్రాణాంతక వ్యాధికి చికిత్స అందించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఆ చిన్నారికి పూర్తి స్థాయి వైద్యం అందించేందుకు ఏకంగా 9 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఇంత భారీ మొత్తాన్ని భరించలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ చిన్నారి కుటుంబానికి అనంత్ అంబానీ ఒక ఆశాకిరణంలా మారారు. బాలుడి పరిస్థితి తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి వేదాంశ్ సింగ్‌కు అభయమిచ్చారు.

ఆసుపత్రిలో ఉన్న వేదాంశ్ తల్లిదండ్రులతో అనంత్ అంబానీ స్వయంగా వీడియో కాల్‌లో మాట్లాడారు. బాబు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారి వైద్యానికి కావాల్సిన రూ. 9 కోట్లు తాను పూర్తిగా అందిస్తానని ఆయన వారికి భరోసా ఇచ్చారు. అనంత్ అంబానీ చూపించిన ఈ దాతృత్వంతో తీవ్రమైన ఆందోళనలో ఉన్న ఆ చిన్నారి కుటుంబంలో ఎన్నో కొత్త ఆశలు చిగురించాయి.

ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో హాలీవుడ్ రేంజ్ యాక్షన్..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు