క్రైమ్ మిర్రర్, సినిమా:- గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘డ్రాగన్’. ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా యావత్ సినీ పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.ఈ మూవీ యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏకంగా హాలీవుడ్ రేంజ్‌లో అత్యంత భారీగా డిజైన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చే రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకునే అనుభూతిని ఇస్తాయని తెలుస్తోంది. అందులో ఒకటి భయంకరమైన జైల్ ఫైట్ కాగా, మరొకటి ఉత్కంఠభరితమైన కాళీమాత టెంపుల్ ఫైట్ అని సినీ వర్గాలు బలంగా చెబుతున్నాయి. ఈ రెండు ఫైట్ సీక్వెన్సులు సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలుస్తాయని టాక్. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఈ ప్రత్యేకమైన సీన్స్ చిత్రీకరణ కోసం ఏకంగా హాలీవుడ్ లెవల్ టెక్నాలజీని, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మేకర్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ వార్తలతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి.
ఇదిలా ఉంటే, ఇటీవల స్వల్ప గాయాలపాలైన ఎన్టీఆర్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆయన ఆ గాయం నుంచి వేగంగా కోలుకున్నారని తెలుస్తోంది. పూర్తి ఫిట్‌నెస్ సాధించిన ఎన్టీఆర్, త్వరలోనే ముమ్మరంగా సాగనున్న ‘డ్రాగన్’ తదుపరి షూటింగ్ షెడ్యూల్‌లో ఉత్సాహంగా జాయిన్ కానున్నారని సమాచారం. హాలీవుడ్ హంగులతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కారు రంగుతో మైలేజ్‌కు లింక్.. ఏ రంగు కారు కొంటే ఇంధనం ఆదా అవుతుందో తెలుసా?
