Homeక్రైమ్వృద్ధ దంపతులు రిజిస్ట్రేషన్‌ కోసం ఆందోళన..!

వృద్ధ దంపతులు రిజిస్ట్రేషన్‌ కోసం ఆందోళన..!

-నెల రోజులుగా కార్యాలయం చుట్టూ తిప్పుతున్నా పట్టించుకోని వైనం
-20 గుంటల భూమి రిజిస్ట్రేషన్‌కు రూ.లక్ష కమిషన్‌ హ. .?
తహసీల్దార్‌ తీరుపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి..

క్రైమ్ మిర్రర్,రంగారెడ్డి :- రంగారెడ్డి జిల్లా అమనగల్‌ మండలం ఆకుతోటపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 496/అ/ఆలో ఉన్న 20 గుంటల భూమి రిజిస్ట్రేషన్‌ విషయంలో వృద్ధ దంపతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బాధితుడు వట్టికోట లక్ష్మయ్య ఆరోపించారు. రిజిస్ట్రేషన్‌ కోసం నెల రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు.
లక్ష్మయ్యకు సుమారు నాలుగు ఎకరాల భూమి ఉండగా, అందులో 20 గుంటల భూమికి సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో కుటుంబ సభ్యుల సమక్షంలో అగ్రిమెంట్‌ చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కోసం స్లాట్‌ బుక్‌ చేసినట్లు చెప్పారు.

తనకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారని, గత రెండేళ్లుగా కుమారుల నుంచి ఆదరణ లేకపోవడంతో తాను, తన భార్య లక్ష్మమ్మ కుమార్తెల వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నామని లక్ష్మయ్య తెలిపారు. తమకు సంబంధించిన భూమి రిజిస్ట్రేషన్‌ విషయంలో కొందరు జోక్యం చేసుకుంటూ సమస్యను మరింత జటిలం చేస్తున్నారని ఆరోపించారు.తహసీల్దార్‌ ఫయీమ్‌ కార్యాలయానికి పలుమార్లు పిలిపించి రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పి, ఆపరేటర్‌, డాక్యుమెంట్‌ రైటర్‌కు తో 1 లక్ష అడిగినట్లు లక్ష్మయ్య ఆరోపించారు. 20 గుంటల భూమి రిజిస్ట్రేషన్‌ విషయంలో రూ.లక్ష కమిషన్‌ డీల్‌ జరిగిందంటూ తనకు సమాచారం ఉందని పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను అధికారులు పరిశీలించాల్సి ఉంది. తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా ఉన్న పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆపరేటర్‌తో ఫోన్‌లో డీల్‌ మాట్లాడినట్లు తనకు అనుమానం ఉందని, అక్కడి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని లక్ష్మయ్య పేర్కొన్నారు.తన భూమి రిజిస్ట్రేషన్‌ విషయంలో ఎలాంటి న్యాయస్థాన ఆదేశాలు లేకపోయినా రిజిస్ట్రేషన్‌ నిలిపివేసి కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వృద్ధ దంపతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్‌ స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు