క్రైమ్ మిర్రర్, శేరిలింగంపల్లి :- లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ శ్రీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, శేరిలింగంపల్లి బృందం రూట్ వాచ్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులను అనుమానంతో తనిఖీ చేశారు.వారి బ్యాగులను సోదా చేయగా 23 కిలోల గంజాయి బయటపడింది. నిందితులను ముంబై వాసులైన రహ్మతుల్లా ఖాన్ మరియు రషీద్ గా గుర్తించారు. వీరు ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది.నిందితులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ కోసం శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ కు అప్పగించారు. ఈ కేసును టాస్క్ ఫోర్స్ సీఐ వాసుదేవ రావు, ఎస్ఐ ధనరాజ్ మరియు సిబ్బంది ఛేదించారు.
లింగంపల్లి స్టేషన్ వద్ద 23 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్!
By Crime Mirror
0
27
Previous article
