క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్‌లో ‘తల్లికి వందనం’ పథకం రెండో విడత లబ్ధిదారుల అర్హుల ఎదురుచూపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాస్తవానికి గతంలో ఆగస్టు 30వ తేదీనే ఈ నిధులను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, సెప్టెంబర్ నెల గడిచిపోయినా తల్లుల ఖాతాల్లో మాత్రం రూ.13 వేలు జమ కాలేదు.
లింగంపల్లి స్టేషన్ వద్ద 23 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్!
మొదటి తరగతి, ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు, అలాగే వివిధ కారణాల వల్ల మొదటి విడతలో రాణివారిని కలుపుకుని మొత్తం సుమారు 2.7 లక్షల మంది అర్హులు ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయం పరిశీలనలో ఉంది. సీఎంవో నుంచి ఈ ఫైలుకు త్వరలోనే ఆమోదం లభిస్తే, త్వరలోనే లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని ఆశగా ఎదురుచూస్తున్న తల్లులు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
