క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- రాష్ట్రంలో అమరావతిని అన్ని కులాల రాజధానిగా మార్చాలన్నదే తన అసలు ఉద్దేశమని, కానీ చంద్రబాబు ఆ విధంగా చేయడం లేదని విజయసాయి రెడ్డి విమర్శించారు. “రెడ్‌బుక్ పార్టీకి, రప్పా రప్పా పార్టీకి ఓటు వేయాలా?” అని ఆయన ఒక ప్రెస్మీట్లో ప్రశ్నించారు. కుల, మత పిచ్చి ఉన్న పార్టీలను ఓడించేందుకు రాష్ట్రంలోని యువత అంతా ఒక్కటై కదిలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఏపీలో ‘తల్లికి వందనం’ రెండో విడత నిధుల కోసం తల్లుల ఎదురుచూపులు
ప్రస్తుతం రాష్ట్రంలో కమ్మ, క్రిస్టియన్ సామాజిక వర్గాల చేతుల్లోనే పూర్తి అధికారాలు ఉన్నాయని విజయసాయి రెడ్డి ఆరోపించారు. అయితే తమ పార్టీలో మాత్రం అన్ని వర్గాల ప్రజలకు సముచితమైన అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో ప్రజల మధ్యలోకి వెళ్లేందుకు తాను త్వరలోనే పాదయాత్ర చేస్తానని ఆయన ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వివరంగా వెల్లడించారు.
లింగంపల్లి స్టేషన్ వద్ద 23 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్!
