దేశంలో సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఎన్నికల విధానంలో కీలక మార్పులు వచ్చాయి. గతంలో ఉన్న బ్యాలెట్ పేపర్ల స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) అందుబాటులోకి వచ్చాయి. అయితే, మొదటి నుండి కూడా ఈ ఈవీఎం విధానంపై ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు, సందేహాలు వ్యక్స్తూనే ఉన్నాయి.ఓటు ఎవరికి పడుతుందో ఓటర్లకు స్పష్టంగా తెలిసేలా అధికారులు వీవీప్యాట్ (VVPAT) లను కూడా తీసుకొచ్చారు. అయినప్పటికీ రాజకీయ వర్గాలలో అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు. ఈ ఈవీఎంల ద్వారా బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ (INC) పార్టీ గట్టిగా ఆరోపిస్తోంది.
కుల, మత పిచ్చి పార్టీలను ఓడించేందుకు యువత కదిలిరావాలి: విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ బ్యాలెట్ పేపర్ల అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇకపై దేశంలో ఏ ఎన్నికలు నిర్వహించినా వాటిని ఈవీఎంల ద్వారా కాకుండా కేవలం బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై ప్రజల్లో, రాజకీయ వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ప్రజాస్వామ్య దేశానికి ఏది సరైన పద్ధతి? ఈవీఎంలు మెరుగా లేక బ్యాలెట్ పేపర్లు మెరుగా? అనే చర్చ ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారుతోంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
ఏపీలో ‘తల్లికి వందనం’ రెండో విడత నిధుల కోసం తల్లుల ఎదురుచూపులు
