Homeక్రైమ్సంగారెడ్డి జిల్లాలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలో వృద్ధ దంపతుల ఆత్మహత్య

క్రైమ్ మిర్రర్ : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం చాప్టా(కె) గ్రామంలో వృద్ధ దంపతులు బావిలో దూకి మృతిచెందిన ఘటన విషాదం నింపింది. తమను కని పెంచిన కుమారులు పట్టించుకోవడం లేదనే మనస్తాపంతోనే ఈ దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన నర్సారెడ్డి (85), అంజమ్మ (82)కు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు హైదరాబాద్‌లో నివాసం ఉంటుండగా, మరో ఇద్దరు గ్రామంలోనే ఉంటున్నారు. గ్రామంలో ఉన్న కుమారులు తల్లిదండ్రులను పట్టించుకోకపోవడంతో పాటు ఇంటి నుంచి బయటకు పంపించారని స్థానికులు పేర్కొన్నారు. దీంతో కొంతకాలంగా దంపతులు గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడు వారి ఖర్చులను చూసుకుంటున్నట్లు సమాచారం.

వృద్ధ దంపతుల పేరుతో ఉన్న వ్యవసాయ భూమిని కుటుంబ సభ్యులకు రాసిచ్చినట్లు గ్రామంలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి దంపతులు తమ వ్యవసాయ భూమి వద్ద ఉన్న బావిలోకి దూకినట్లు సమాచారం. బుధవారం ఉదయం బావిలో మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సీఐ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
also read : చందానగర్‌లో గంజాయి ముఠా అరెస్ట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు