Homeఆంధ్ర ప్రదేశ్వంగవీటి మోహన్ రంగా చుట్టూ రాజకీయం...!

వంగవీటి మోహన్ రంగా చుట్టూ రాజకీయం…!

  • ఉండ్రాజవరం లో విగ్రహ వివాదం

  • ఖండించిన కుమార్తె ఆశాకిరణ్

  • వైసీపీలోకి వస్తారని విస్తృత ప్రచారం.

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ రాజకీయాల్లో వంగవీటి మోహన్రంగా అది ప్రత్యేక స్థానం. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయన పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన పేరు చెప్పి కాపు సామాజిక వర్గం ఓటర్లను తమ వైపునకు తిప్పుకునే రాజకీయం నడుస్తూనే ఉంటుంది. అయితే తాజాగా ఎన్నికలకు ఇంకా మూడేళ్ల ముందు వంగవీటి మోహన్ రంగ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

గోదావరి జిల్లాలో వంగవీటి మోహన్ రంగ విగ్రహం చుట్టూ ఇప్పుడు రాజకీయం ప్రారంభం అయింది. ఉండ్రాజవరంలో ఏర్పాటుచేసిన రంగా విగ్రహం విషయంలో తలెత్తిన వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. ప్రస్తుతం కూటమి వైపు కాపు సామాజిక వర్గం ఉంది.

అయితే ఇప్పుడు రంగా విగ్రహానికి సంబంధించి అన్యాయం జరుగుతోంది అంటూ వైసీపీ ఆరోపించడం ప్రారంభించింది. సోషల్ మీడియాలో సైతం దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఆ పార్టీ.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వంగవీటి మోహన్రంగా కుమారుడు రాధాకృష్ణ. మరోవైపు ఆయన కుమార్తె ఆశాకిరణ్ యాక్టివయ్యారు. పొలిటికల్ ఎంట్రీ కి సిద్ధంగా ఉన్నారు. రంగా రాధా మిత్రమండలి బలోపేతంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఉండ్రాజవరంలో జరిగిన విగ్రహ వివాదం పై ఆశా కిరణ్ ఘాటుగా స్పందించారు.

త్వరలో తమ ప్రభుత్వం వస్తుంది అంటూ ఆవేశంగా వ్యాఖ్యానించారు. అయితే ఆమె ఉద్దేశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. త్వరలో ఆశా కిరణ్ వైసీపీలోకి వస్తారని… అందులో భాగంగానే ఈ వ్యాఖ్య చేశారంటూ చెబుతోంది.

వంగవీటి ఆశకిరణ్ యాక్టివ్ అయినప్పుడు కూడా వైసిపి ఇదే తరహా ప్రచారానికి తెరలేపింది. ఆమె వైసీపీలోకి వచ్చేస్తున్నారంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసింది. సోషల్ మీడియా హోరెత్తింది. అయితే తాను ఏ పార్టీలో చేరలేదని.. రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటే కచ్చితంగా ప్రత్యేక ప్రకటన చేస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

దీంతో ఆ ప్రచారానికి చెక్ పడింది. అయితే ఇప్పుడు ఉండ్రాజవరం విగ్రహ వివాదం నేపథ్యంలో ఆశా కిరణ్ చుట్టూ రాజకీయం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి. అయితే ఆమె కుటుంబం టిడిపిలో ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయరని వంగవీటి అభిమానులు చెబుతున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు